అందాల ముద్దు గుమ్మ రాశి కన్నా, నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు, అంద చందాలకు టాలీవుడ్ ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో తెలుగు ఇండస్ట్రీలో రాశి కన్నా కు వరుస ఆఫర్లు దక్కాయి. అందులో భాగంగా రాశి ఖన్నా బెంగాల్ టైగర్, జై లవకుశ, తొలిప్రేమ, హైపర్, వరల్డ్ ఫేమస్ లవర్, ప్రతి రోజు పండగే, సుప్రీమ్ వంటి పలు చిత్రాలలో నటించి తెలుగు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది. ఇలా తెలుగు లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రాశి ఖన్నా సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది.

 తాజాగా రాశి ఖన్నా అభిమానులతో క్యూస్షన్ అండ్ ఆన్సర్ సెషన్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు రాశి ఖన్నా సమాధానాలు ఇచ్చింది. అయితే తెలుగు లో తనకు నచ్చిన నటులు ఎవరు అనే ప్రశ్నకు రాశి ఖన్నా సమాధానం ఇస్తూ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు అంటే ఇష్టమని ఇక హీరోయిన్ల లో సమంత, అనుష్క అంటే ఇష్టం అని రాశి కన్నా తెలిసింది. డాన్స్ విషయంలో అయితే అల్లు అర్జున్ డాన్స్ కు తాను ఫ్యాన్ అని రాశి కన్నా తెలిపింది. ప్రస్తుతం రాశి కన్నా, గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు తెలుగులో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న థాంక్యూ ఈ సినిమాలో కూడా నటిస్తుంది. తమిళ్ లో అరణ్మనై 3, సర్దార్ తదితర సినిమాలలో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: