మన దేశంలోని చాలా ప్రాంతాల్లో కూడా కరోనా మహమ్మారి ప్రస్తుతం ఒకింత తగ్గింది అనే చెప్పాలి. అయితే దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రజలు పక్కాగా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అనేకమంది వ్యాక్సిన్ తీసుకోవడం కూడా అది కొంత తగ్గుముఖం పట్టడానికి కారణం అని అంటున్నారు అధికారులు. అయితే ఇటీవల పూర్తిగా అన్ని రంగాలు తెరుచుకోవడంతో పాటు సినిమా రంగంలో కూడా వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకుల మెప్పు పొందుతూ మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి.

ఇక రాబోయే క్రిస్మస్ పండుగ కానుకగా ఇప్పటికే భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప డిసెంబర్ 17న విడుదల కానున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తుండగా సుకుమార్ ఈ మూవీని తీస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్, ఒక సాంగ్ అందరిలో పుష్ప పై భారీ అంచనాలు ఏర్పరిచాయి. అయితే మరోవైపు దీనికి పోటీగా సరిగ్గా అదే రోజున మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య కూడా విడుదల కానుందని సమాచారం. చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా కాజల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా నుండి కూడా ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు లాహే లాహే సాంగ్ అందరి నుండి విశేషమైన ఆదరణ సొంతం చేసుకుని సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసాయి. నిజానికి ఆచార్య మూవీ ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ జాప్యంతో దానిని డిసెంబర్ కి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక పుష్ప విడుదల రోజునే సరిగ్గా ఆచార్య కూడా రిలీజ్ కానుందని, త్వరలో దీనిపై అధికారికంగా ప్రకటన రానుందని తెలుస్తోంది. మరి ఇదే కనుక జరిగితే మెగాస్టార్, స్టైలిష్ స్టార్ ల మధ్య బాక్సాఫీస్ వార్ షురూ అయినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: