విజయశాంతి హీరోగా టి.కృష్ణ దర్శకత్వంలో 1986లో వచ్చిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ప్రతిఘటన. చంద్రమోహన్ మరియు రాజశేఖర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఏకంగా మూడు నంది అవార్డులు వచ్చాయి అంటే ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరించిందో అర్థం చేసుకోవచ్చు.  ప్రధాన పాత్ర పోషించిన విజయశాంతికి ఉత్తమ నటిగా, ఉత్తమ గాయని ఎస్ జానకి కి, హరనాధ రావు కు ఉత్తమ మాటల రచయితగా ఈ పురస్కారాలు లభించాయి. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.

అన్యాయాన్ని ఎదిరించే ఓ మహిళ పాత్రలో విజయశాంతి తన నటనా విశ్వరూపాన్ని చూపించగా ఆమెకు తగ్గట్లుగానే కథను కూడా అద్భుతంగా తీర్చి దిద్ది టి.కృష్ణ గొప్ప హిట్ ను అందుకున్నారు. మొదట్లో ఈ పాత్రను వేరే హీరోయిన్ తో చేయించాలని ఇతర చిత్ర బృందం చెప్పిన కూడా ఆయన వినలేదు.  విజయశాంతి తోనే ఈ సినిమా చేయాలని పట్టుబట్టి ఆమెను ఒప్పించాడు. అయితే ఈ సినిమా చేయడానికి విజయశాంతికి సమయం చిక్కలేదు విజయ శాంతి కి. 

ఆ సమయంలో ఆమె నటిస్తున్న ఇతర చిత్ర నిర్మాతలతో మాట్లాడి ఈ సినిమా కోసం కొంత సమయాన్ని కేటాయించ కలిగింది విజయశాంతి.  కేవలం నెల రోజుల్లోనే ఈ సినిమా పూర్తి కాగా ప్రతి నాయకుడిగా చరణ్ రాజ్ నటించడానికి అంగీకరించడం ఈ సినిమాకే హైలైట్ అయింది. ఆయన అప్పటికే కన్నడ సినిమాలలో అగ్ర కథానాయకుడు గా కొనసాగుతున్నాడు. అలాంటి హీరో ప్రతినాయకుడిగా అందులోనూ ఇలాంటి క్రూరమైన పాత్రలో నటించడం అంటే మంచి విశేషం అనే చెప్పాలి. ఈ దుర్యోధన దుశ్యాసన అనే పాట ఇప్పటికీ ఎంతో మందిని రంజింప చేస్తుంది. ఉత్తమ నిర్మాతగా కూడా రామోజీరావుకు ఫిలింఫేర్ అవార్డు దక్కింది. ఏదేమైనా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ నుంచి వచ్చిన ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలలో ప్రతిఘటన చిత్రం ఎప్పటికీ మరిచి పోలేని సినిమా గా నిలిచిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: