సమంత ను అప్పటి వరకు గ్లామర్ పాత్రల్లో స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా మాత్రమే చూస్తూ వచ్చారు ప్రేక్షకులు. వేరే హీరోయిన్ల మాదిరిగా సమంత కమర్షియల్ చిత్రాలు చేస్తున్న టైంలో మధ్యలో ఒక్క లేడి ఓరియెంటెడ్ సినిమా కూడా చేయలేదు. వివాహం తర్వాత ఆమె తన కెరియర్ లో చివరి అంకంలో ఉన్నప్పుడు సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో చేసే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టింది ఆ నేపథ్యంలోనే తాను లో సూపర్ హిట్ అయినా యూ టర్ను చిత్రాన్ని తెలుగులో అనువదించింది త్రిభాషా చిత్రంగా తమిళంలో విడుదలైన ఈ చిత్రం 2018 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ విపరీతంగా అలరించింది.

కన్నడ సినిమా మాతృక దర్శకుడు పవన్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా శ్రీనివాస్ చిత్తూరి ఈ సినిమాను నిర్మించడం విశేషం. చెన్నైలో ఒక ప్రత్యేకమైన ఫ్లైఓవర్ మధ్య ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల మరణం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆది పినిశెట్టి రాహుల్ రవీంద్రన్ భూమిక చావ్లా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించారు. బాగా బిజీగా ఉండే ఓ ఫ్లై ఓవర్ వద్ద కొంత మంది రాంగ్ రూట్ లో యూటర్న్ తీసుకుని ప్రయాణిస్తూ ఉంటారు. దాన్ని గమనించి ఫోటోలు తీస్తూ అలా చేయడం నేరమని వారికి చెప్పే ప్రయత్నం చేస్తోంది సమంత.

అయితే అలా యూటర్న్ తీసుకున్న వాళ్లు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. యూటర్న్ తీసుకున్న వాళ్ళు చనిపోవడం ఏంటి అని దాని వెనుక ఉన్న మర్మం తెలుసుకోవడానికి సమంత కావాలని యూ టర్న్ తీసుకుంటుంది. అలా యూటర్న్ తీసుకున్న తర్వాత ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది. దీనిలో భూమిక పాత్ర ఏంటి అనేది ఈ సినిమా కథ. వినాయక చవితి సందర్భంగా 2018 లో విడుదలైన ఈ చిత్రం కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాగా చిత్ర బృందానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది ఈ సినిమా. ఇదిలా ఉంటే సమంత ఇటీవలే ఆమె భర్త నాగచైతన్య నుంచి విడాకులు పొందింది. మరి భవిష్యత్తులో ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎన్ని చేస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: