అప్పటిదకా అనుష్క అంటే అందాలతార మాత్రమే కానీ ఒక్క సినిమా ఆమె గ్లామరస్ రోల్స్ మాత్రమే కాదు నటన ప్రాధాన్యత ఉన్న పాత్రలు కూడా చేయగలదు అని నిరూపించింది ఆ సినిమానే అరుంధతి. అంజి సినిమా సమయంలో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కి ఒక ఫాంటసీ హారర్ సినిమా చేయాలని అనుకున్నడట. అయితే ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో కొంచెం గాప్ తీసుకొని అరుంధతి సినిమాని కోడి రామకృష్ణ గారికి వినిపించారు అని టాక్. విన్న వెంటనే కోడి రామకృష్ణ గారు అసక్తితో డైరెక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు.

 అయితే హీరోయిన్ ఎవరా అని వెతికే సమయంలో ఎవరో అనుష్క పేరు చెప్పారట. వెంటనే ఆమెని పిలిపించి ఫోటోషూట్ చేశారు. శ్యామ్ ప్రసాద్ గారికి కోడి రామకృష్ణ గారికి అనుష్క నే ఈ పాత్ర వెయ్యేగలదు అనే నమ్మకం వచ్చింది. ఆ తర్వాత పశుపతి పాత్ర కోసం సోను సూద్ ని పాకిర్ పాత్ర కోసం షియాజి షిండే ని కూడా సెలెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కి ఘనంగా విడుదలైంది. మొదట్లో సినిమా కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉండేవి మెల్లగా ఆ కలెక్షన్స్ పెరగడం మొదలయ్యాయి.

అలా ఈ సినిమా 30 కోట్లా షేర్ ని కొల్ల గొట్టి ఆ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అనుష్క కి తెలుగు తమిళం లోనే కాకుండా ఇండియా అంత పెరు వచ్చింది. ఫ్యామిలీస్ తో కలిసి చూసే హారర్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి . ఈ సినిమా విజయంతో అంజి సినిమాకి మెగాస్టార్ కి అప్పు పడిన రెమ్యూనరేషన్ శ్యామ్ ప్రసాద్ అరుంధతి సినిమాతో తీర్చాలని చిరు  ఇంటికి వెళ్తే ఆయన ఆ డబ్బు ని సున్నితంగా తిరస్కరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: