నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'అఖండ'.ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య కి జోడిగా యంగ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తోంది.ఇక ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ చేసిన ఓ పాటతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.అయితే కరోనా ప్రభావంతో వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తి కావడంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగిపోయారు.ఈ క్రమంలోనే బాలయ్య అండ్ టీమ్ స్పెషల్ పార్టీ కూడా చేసుకుంది.

డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాలకృష్ణ, నిర్మాతలు, హీరోయిన్లు మరియు ఇతర చిత్ర యూనిట్ సభ్యులంతా కలసి పార్టీ చేసుకున్నారు.ఈ నేపథ్యంలో బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ పార్టీ లో చిల్ అవుతున్న ఫోటో ఒకటి నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.వైట్ అండ్ వైట్ డ్రెస్ లో బాలకృష్ణ చిరునవ్వు చిందిస్తూ విక్టరీ సింబల్ చూపిస్తుండగా..పక్కనే ఉన్న ప్రగ్యా జైస్వాల్ హీరోతో కలిసి పార్టీ మూడ్ లో చిల్ అవుతున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.ఇక అఖండ యూనిట్ సెలెబ్రేట్ చేసుకున్న పార్టీ ఫోటోలు చూసి నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

 ఇక టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం అఖండ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4 న విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జగపతిబాబు, శ్రీకాంత, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన మొదటి పాటికి ఆడియన్స్ నుండి మంచి స్పందన లభించింది.ఇక ఈ సినిమాలో బాలకృష్ణ మొత్తం మూడు డిఫరెంట్ గెటప్స్ కో దర్శనమివ్వనున్నాడట. అందులో అఘోరా, ఫ్యాక్షనిస్ట్ గానే కాకుండా ఒక యంగ్ కలెక్టర్ పాత్రలో కూడా బాలయ్య కనిపించనున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: