దర్శకుడు అంటే కెప్టెన్. ఒక సినిమా ముందుకు సాగాలన్నా, ఒక సినిమా బాగా రావాలన్నా ఒక సినిమా సూపర్ హిట్ కొట్టాలన్న నిర్మాత కంటే ఎక్కువ బాధ్యత దర్శకుడు మీదనే ఉంటుంది. కథ దగ్గర్నుంచి రిలీజ్ కాబోయే ముందు రోజు ప్రమోషన్స్ వరకూ ఎంతో జాగ్రత్తగా తన సినిమాను ప్లాన్ చేసుకోవాలి దర్శకుడు. లేదంటే ఏ ఒక్క చిన్న విషయంలో జాప్యం చేసినా కూడా ఫ్లాప్ ఎదురు కావడం ఖాయం.  ఆ విధంగా ఇప్పటి వరకు చాలా మంది దర్శకులు ప్రతి ఒక్క విషయంలో కేర్ తీసుకొని తమ సినిమాలను హిట్ చేసుకొని అగ్ర దర్శకులు గా ఎదిగారు.

అయితే మన దర్శకులపై ఎప్పటినుంచో ఒక అపవాదు ఉంది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. అదేమిటంటే ఇతర రచయితల గురించి ఏదైనా సీన్ కానీ కథ కానీ తీసుకుంటే వారికి ఆ క్రెడిట్ ఇవ్వరనీ, అంతేకాదు ఏదైనా నవల నుంచి ప్లాట్ తీసుకుంటే దానికి కూడా సదరు రచయిత కు క్రెడిట్ ఇవ్వరని, అదేదో తామే చేసినట్టుగా, సృష్టించినట్లు గా భావించి వారు తమ పేరును వాడుకుని ప్రజలలో పేరు తెచ్చుకోవాలని చూస్తారని అంటున్నారు. కానీ ఏదో ఒక నాడు సదరు రచయితలు దర్శకుల కుతంత్ర బుద్ధి ను పసిగట్టి ప్రజలకు చాటి చెప్పి వారిలో టాలెంట్ లేదనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెబుతారు.

ఇప్పటివరకు ఎంతో మంది పెద్ద దర్శకుల విషయంలో ఇది రుజువయింది. కానీ తాజాగా ఇటీవలే కొంతమంది దర్శకుల తీరు మారినట్లుగా వారు చేస్తున్న పనులను బట్టి తెలుస్తుంది. అదేమిటంటే ఏదైనా వేరే వారి సృజనాత్మకత తీసుకున్నప్పుడు వారికి తప్పకుండా క్రెడిట్ ఇస్తున్నారు. ఆ విధంగా వారు మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇతరుల నుంచి కథను, ప్లాట్ ను తీసుకోవడం ఏ మాత్రం తప్పు కాదు.  కానీ వారికి ఇవ్వాల్సిన క్రెడిట్ వారికి ఇస్తే అందరికీ సంతోషం. తాజాగా క్రిష్ సినిమా కొందపోలం సినిమా కు  సంబంధించిన నవలా రచయిత  కు క్రెడిట్ ఇచ్చి తన మర్యాదను నిలబెట్టుకున్నాడు. ఈ విధంగా అందరు దర్శకులు చేస్తే సినిమా పరిశ్రమ మరింత ముందుకు పోతుందని, సదరు రచయితలు కూడా ఎంతగానో సహకరిస్తారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. 

మరింత సమాచారం తెలుసుకోండి: