టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న సితార త్వరలోనే వెండి తెరపై కూడా సందడి చేయనున్నట్లు ఒక వార్త అయితే గట్టిగానే వినిపిస్తోందని తెలుస్తుంది.

అదికూడా కోలీవుడ్ స్టార్ హీరో అయిన విజయ్ దళపతి సినిమాలో ఒక ఎమోషనల్ పాత్రలో నటించబోతున్నట్లు గా ఇండస్ట్రీలో ప్రచారం జరుగతున్నట్లు తెలుస్తుంది.త్వరలోనే విజయ్ తన 66వ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో మొదలు పెట్టబోతున్న విషయం అందరికి తెలిసిందే.

ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్ తో టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాత అయిన దిల్ రాజు నిర్మించనున్నారని తెలుస్తుంది . ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు వంశీ ఇటీవల సితార ఘట్టమనేని కూడా ఒక పాత్ర కోసం సెలెక్ట్ చేసుకున్నట్లుగా సమాచారం.సినిమాలో హీరో విజయ్ కూతురుగా ఒక ఎమోషనల్ పాత్రలో నటించబోతున్నారని సమాచారం. ఇక వంశీ పైడిపల్లి కూతురు అధ్య అలాగే మహేష్ బాబు కూతురు సితార కూడా మంచి స్నేహితులని తెలుస్తుంది.

తరచుగా వీరు ఒకరి ఇంటికి మరొకరు వెళుతూ ఉంటారని తెలుస్తుంది. ఇక వంశీపైడిపల్లికి సితార గురించి బాగా తెలుసు కాబట్టే ఆమెను సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేయాలని చూస్తున్నాడని సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాలని తెలుస్తుంది.ప్రస్తుతం మహేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తన కొడుకు గౌతమ్ ను సినిమాలకు పరిచయం చేసిన మహేష్ తన కూతురు ఇంట్రడక్షన్ ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి మరి. మహేష్ సినీ కెరీర్ ను సూపర్ స్టార్ కృష్ణ ఎలా ప్లాన్ చేసారో మహేష్ కూడా ఆయన నాన్ననే ఫాలో అవుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: