అందాల ముద్దుగుమ్మ రాశి కన్నా నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు రాశి కన్నా అంద చందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ టాలీవుడ్ టాప్ హీరోయిన్ల సరసన చేరిపోయింది. ప్రస్తుతం కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న రాశి కన్నా సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా రాశి ఖన్నా తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనే సెషన్ ను నిర్వహించింది. ఈ ఇంటరాక్షన్ లో రాశి కన్నా తన వ్యక్తిగత వివరాలతో పాటు తన కెరియర్ అంశాలను ప్రశ్నించగా..

తాను ఇంకా కూడా ఒంటరిగా ఉన్నాను అని, తనకు ఇప్పటి వరకు బాయ్ ఫ్రెండ్ లేడు అని రాశి కన్నా వెల్లడించింది. నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే కచ్చితంగా చెప్తాను అని రాశి  కన్నా తెలియజేసింది. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు తనకు ఇష్టమైన హీరోలు అని తెలిపిన రాశి కన్నా అలాగే సమంత, అనుష్క తనకు ఇష్టమైన హీరోయిన్లుగా తెలిపింది. అల్లు అర్జున్ గొప్ప నటుడే కాక గొప్ప డాన్సర్ అని కూడా చెప్పిన రాశి కన్నా తనతో నటించాలని ఉంది అని రాశి కన్నా తెలియజేసింది. మలయాళంలో భ్రమం - తమిళంలో అరణ్మనై 3 విడుదల కోసం ఎంతో ఆసక్తితో రాశి ఖన్నా ఎదురుచూస్తోంది. వీటితో పాటు తెలుగులో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో కూడా రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: