ఒకప్పుడు వంశీ రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ లో సినిమా అంటే ఒక రేంజ్ లో అంచనాలు ఉండేవి. ఇద్దరు కలిసి తెలుగు కామెడీ కి కొత్త అర్థం చెప్పారు. వారి కలియక లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్స్. ఆ సినిమాల్లో ఏప్రిల్ ఒకటి విడుదల సినిమా చాలా ప్రత్యేకమైనది. మన తెలుగులో టాప్ కమెడియన్ కృష్ణ భగవాన్ ఈ సినిమాకి రైటర్ గా పని చేయడమే కాకుండా విలన్ గా కూడా నటించారు.డైరెక్టర్ వంశీ తో ఉన్న అనుబందంతో ఆయన ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు.

 ఇక ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ గారు అబద్ధాలు ఆడే దివాకరంగా మాములు హాస్యం పండించలేదు. రోజు ఎన్నో అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేసే దివాకరం కు అతని ప్రేయసి ఒక పరీక్ష పెడుతుంది. అదేంటి అంటే ఒక నెల పాటు ఏ అబద్ధం చెప్పకుండా అన్ని నిజాలు మాత్రమే చెప్తే తనని ప్రేమిస్తా అని అనడంతో దివాకరం ఆ ఒప్పందానికి ఒప్పుకుంటాడు. అప్పటినుంచి అన్ని నిజాలే చెప్పడం దివాకరం కి ఎన్ని చిక్కులు వచ్చాయి అనేది ఈ సినిమా కథ. ఇదే కథతో 1997 లో లయర్ లయర్ అనే హాలీవుడ్ సినిమా కూడా రావడం విశేషం.

 ఇక ఏప్రిల్ ఒకటి విడుదల సినిమాలో శోభన గారి పాత్ర చాలా బాగా చిత్రీకరణ చేశారు డైరెక్టర్ వంశీ. ఈ సినిమాలో పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే.ఇళయరాజా గారు సంగీతం అందించిన ఈ సినిమాలో ఒక్క ఒకక్క పాట ఒక్కో ఆణిముత్యం. చుక్కలు తెమ్మన్న తెంచుకురాన పాట ఇప్పటికి అందరి ఫోన్ లలో మారుమోగుతూనే ఉంటుంది. వంశీ గారి సినిమాల్లో వుండే అన్ని కామెడీ అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయి. దివాకరం నిజాలు చెప్పలేక పడే కష్టాలు చూసే అందరికి  నవ్వుల పండగే.

మరింత సమాచారం తెలుసుకోండి: