ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రకాష్ రాజు.  ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించి నటనకు ప్రతిరూపం గా మారిపోయారు. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాదు అటు తమిళ మలయాళ కన్నడ చిత్రాల్లో తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసు్నుకున్నారు ప్రకాష్ రాజు.  చివరకు ఆయన చేయని పాత్ర లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. హీరో హీరోయిన్ తండ్రి పాత్రల్లో, పోలీస్ పాత్రలు, విలన్ పాత్రలు, కమెడియన్ పాత్రలు, తాత పాత్రలు ఇలా అన్ని రకాల పాత్రలు చేసి..  నవరసాలను పండించిన గొప్ప నటుడు ప్రకాష్ రాజు.  ఏదైనా పాత్రలో ప్రకాష్ రాజు నటిస్తున్నాడు అంటే చాలు ఇక ఇక ఆ పాత్ర ఏ రేంజ్లో ఉంటుందో అని అంచనాలు పెట్టేసుకుంటారు ప్రేక్షకులు.


 అంతలా చిత్ర పరిశ్రమలో ప్రకాష్ రాజు తనదైన ముద్ర వేసుకున్నాడు అని చెప్పాలి.  ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్త ప్రకాష్ రాజు కనిపించడం లేదు కానీ ఒకప్పుడు అయితే ఏ సినిమాలో చూసినా ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించాడు.  ఇకపోతే ప్రకాష్ రాజు సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాడు. తన వ్యాఖ్యలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు ప్రకాష్ రాజు. ఇకపోతే ఇటీవల మా ఎలక్షన్లలో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నారు.  దీంతో తరచూ సోషల్ మీడియాలో ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నారు ప్రకాష్ రాజు.



 ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి వచ్చారు ప్రకాష్ రాజు.  ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తన జీవితానికి తన సినిమా కెరియర్ కి సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు.  ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ ప్రోమోలో భాగంగా తన రియల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు తెలిపారు. మీరు మొదటి భార్యతో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అని అడగగా..  ఇద్దరం కలిసి ఉండలేము అనుకున్నప్పుడు నరకంలో కలిసి ఉండటం కంటే విడిపోయి హ్యాపీగా ఉండాలి అనుకున్నాం అందుకే విడిపోయాము అంటూ సమాధానం చెప్పాడు ప్రకాష్ రాజు.  ఇంట్లో ఎలా ఉంటారు అని అనగా సినిమాల్లో మాత్రమే నేను విలన్ ఇంట్లో మాత్రం నాది కుక్క బతుకు అందరూ ఆర్డర్ వేస్తారు జోకర్లా చూస్తారు అటు ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: