ఉప్పెన ఫేమ్ పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ "కొండ పోలం" అక్టోబర్ 8న అంటే ఈరోజు వెండితెరపైకి వస్తోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెలుగు నవల "కొండపొలం" కి అనుకరణగా ఈ సినిమాను తెరకెక్కించారు. "కొండపొలం" అనేది సాహసవంతమైన, ప్రమాదకర ప్రయాణం అని, గొర్రెల కాపరి సంఘం ప్రజలు ఆకలి సమయంలో తమ జీవనోపాధి కోసం ఏ పనిని చేపట్టినట్లు క్రిష్ చెప్పారు. కథ స్క్రీన్ ప్లేకి తగినట్లుగా నవలలోని కథలో కొన్ని మార్పులు చేశారు. సినిమా కోసం రచయిత దర్శకుడి ఇన్‌పుట్‌లకు అనుగుణంగా కథను తిరిగి వ్రాసాడు.

నల్లమల అడవుల చుట్టుపక్కల గ్రామాల్లో వర్షాభావం కారణంగా గొర్రెలకు తినడానికి మేత, తాగటానికి నీరు లేనప్పుడు, వర్షాలు పడే వరకు తమ గొర్రెలని బతికించుకోవటం కోసం గొర్రెల కాపరులు అడవి బాట పడతారు. మళ్లీ తమ ఊరిలో వానలు పడి గొర్రెలకు నీరు, మేత దొరికే వరకు అడవుల చుట్టూ సంచరిస్తుంటారు. ఇలా చేసే వనవాసాన్ని స్థానికులు కొండపొలం వెళ్లటం అని అంటారు. కొన్ని తరాలుగా ఈ గొర్రెల కాపరుల కుటుంబాలకు ఇలా తరచు 'కొండపొలం' పోవలసి రావటం తప్పక పోవటంతో, ఒక ప్రత్యేకమైన జీవన విధానం, పద్ధతులు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఈ వనవాసానికి గుండె ధైర్యం ఉండాలి. పెద్దపులి ఆనుపానులు తెలుసుకోగలగాలి. కొండజ్వరం రాకుండా చూసుకోవాలి. ఈ నిత్య జీవిత సాహస యాత్రలో మనల్ని భాగస్వాములను చేస్తుంది. ఈ 'కొండపొలం' నవల. "కొండపొలం" నవలను సన్నపురెడ్డి వెంకట్ రామ్ రెడ్డి  రాశారు.

ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ రవీంద్ర పాత్రలో నటించగా, రకుల్ ప్రీత్ సింగ్ ఓబులమ్మగా డీగ్లామర్ రోల్ లో కనిపించబోతోంది. ఇక ఇప్పటికే మెగాస్టార్ ఈ సినిమాపై ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. కానీ పేక్షకులు అసలు రివ్యూ ఇవ్వాల్సి ఉంది. వైష్వ తేజ్ రెండో సినిమాతో హిట్ అందుకుంటాడా ? అనేది చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: