నాగ చైతన్య - సమంత వీరిద్దరూ కేవలం టాలీవుడ్ లోనే బెస్ట్ జోడి కాదు దేశం మొత్తం గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జోడి లలో వీరు కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు పది సంవత్సరాల పాటు ప్రేమించి ఇరువర్గాల పెద్దలను ఒప్పించి, ఆ తరువాత పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. మొత్తంగా సోషల్ మీడియా ద్వారా ఏం జరిగిందో తెలియదు కానీ విడాకులు తీసుకుంటున్నాము అని ప్రకటించడంతో వీరి అభిమానులకు గుండె పగిలిన అంత పని అయింది అనే చెప్పాలి. ముఖ్యంగా అభిమానుల గుండెలు దుఃఖ భారంతో ఏడుపు వచ్చే విధంగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు.


ఇక సినీ ఇండస్ట్రీలో కూడా వీరిద్దరి విడాకుల వ్యవహారం పై ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్న విషయాలను మనం గమనిస్తూనే  ఉన్నాము. కానీ వారి సన్నిహితులు అలాగే ఇండస్ట్రీ వర్గాల వారు మాత్రం సమంత - నాగచైతన్య అభిప్రాయాలను మనం గౌరవించాలి అంటూ వాళ్ళు మాత్రం ఏమి కూడా వీరి  చెప్పడం లేదు.. ఈ నేపథ్యంలోనే చైతు - సమంతల తో కలిసి ఆటోనగర్ సూర్య అనే సినిమాను తెరకెక్కించిన దర్శకుడు దేవాకట్ట వీరి విడాకుల వ్యవహారం పై స్పందించాడు.. ఇటీవల రిపబ్లిక్ సినిమా విడుదల సందర్భంగా మాట్లాడుతూ.. వీరి ప్రేమ గురించి , విడాకుల గురించి కూడా మాట్లాడడం జరిగింది.

ముఖ్యంగా ఆటోనగర్ సూర్య సినిమా షూటింగ్ సమయంలో సమంత , నాగ చైతన్య ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు. ఆ  సమయంలో వారు ఎంతో ఆలోచించేవారు అంటూ చెప్పుకొచ్చారు. వీరిద్దరు కూడా చాలా సన్నిహితంగా ఉండడం తో పాటు ప్రతి విషయాన్ని కూడా చర్చించుకుంటూ ప్రొఫెషనల్ గా ఉండడం నేను గమనించాను అంటూ తెలిపాడు. కానీ అప్పటికి నాకు వారిద్దరూ ప్రేమలో పడ్డారని , ప్రేమలో ఉన్నారనే విషయం తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు..


అయితే పెళ్లి బంధం వర్కౌట్ కానప్పుడు వారిద్దరు విడిపోవడమే చాలా మంచి నిర్ణయం అంటూ ఇద్దరూ కలిసి జీవించలేము  అనుకున్నప్పుడు విడిపోవడమే మంచి నిర్ణయం అని తెలిపాడు దేవాకట్టా. అంతేకాదు వీరిద్దరూ ఫ్యామిలీ విషయంలో కూడా మంచి జీవితాన్ని అనుభవించలేని తరుణంలో విడిపోవడమే మేలు అని చెబుతున్నారు డైరెక్టర్ దేవాకట్టా.


మరింత సమాచారం తెలుసుకోండి: