త‌మ ప్రాంత సినిమా ఏద‌యినా వ‌స్తే ప్ర‌భుత్వాధిప‌తులు త‌ప్ప‌క స్పందిస్తారు. త‌మ విషెస్ తెలియ‌జేస్తారు. ఈ సినిమా కూడా సీమ ప్రాంతంలో జ‌రిగిన ఓ క‌థ. త‌న సొంత జిల్లా రచయిత రాసిన న‌వ‌ల ఇది. అయినా సీఎం జ‌గ‌న్ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు అన్న విమ‌ర్శ ఉంది. సినిమా విడుద‌ల సంద‌ర్భంగా విషెష్ చెప్పినా బాగుండు. ఆ ప‌ని కూడా  చేయ‌లేదు జ‌గ‌న్ . మ‌ల్లేశం సినిమా స‌మ‌యంలో కేటీఆర్ ఆ సినిమాకు ఎంతో అండ‌గా నిలిచారు. సోష‌ల్ మీడియా ద్వారా శుభాభినంద‌న‌లు తెల‌ప‌డమే కాదు ఇలాంటి సినిమాలు రావాల్సిన ఆవ‌శ్య‌క‌త గురించి కూడా తెలియ‌జెప్పారు. కానీ జ‌గ‌న్ అస్స‌లు ఇలాంటి ఏవీ చేయ‌రు. ఓ ప్రాంత సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను ముఖ్య‌మంత్రులు ప‌ట్టించుకోక‌పోతే ఎవ‌రు ప‌ట్టించుకుంటారు. అయినా ఇది సీమ క‌థ. సీమ నేల‌ల‌లో న‌డ‌యాడిన క‌థ, ఈ ప్రాంతలో న‌డ‌యాడిన సంస్కృతి, ఇంకా చెప్పాలంటే ప‌ని సంస్కృతి వీట‌న్నింటి గురించి చెప్పిన క‌థ.. తానా పోటీల‌లో ర‌చ‌యిత స‌న్న‌పురెడ్డి వెంక‌ట రామిరెడ్డి ని విజేత‌గా నిలిపిన న‌వ‌ల.  దేశం కాని దేశంలో ఉంటూ ఓ తెలుగు సంస్థ తెలుగు ను బ‌తికించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నంలో ఓ గొప్ప పోటీలో నిలిచిన న‌వ‌ల. 


ఇన్ని ప్ర‌త్యేక‌త‌లు రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన సీఎంకు ప‌ట్ట‌లేదు.. ఇన్ని ప్ర‌త్యేక‌త‌లు త‌మ ప్రాంతానికి ఉన్న ర‌చ‌యిత క‌థ‌లో ఉన్నాయి అన్న విష‌యం అస్స‌లు ప‌ట్ట‌లేదు. క‌నీసం ఆయ‌న త‌ర‌ఫున శుభాభినంద‌న‌లు చెబితే ఎంతో హుందాగా ఉండేది. ఓ ప్రాంతం ఓ వైవిధ్యం ఓ వైరుధ్యం వీట‌న్నింటి గురించి మాట్లాడ‌కుండా, సంబంధించిన సినిమా గురించి మాట్లాడ‌కుండా నేత‌లు ఉండే నిజంగా ఆ ప్రాంతానికి ద్రోహం చేసిన వారే అవుతారు. ఆ ప‌ని ఎవ్వ‌రు చేసినా జ‌నం క్ష‌మించ‌రు. సినిమా అన్న‌ది ఓ సామాజిక ప్ర‌యోజ‌నం లో భాగం అయితే త‌ప్ప‌క ఆదరించాల్సిందే! ఏపీ సీఎం ఈ ప‌ని చేస్తే బాగుండు. త‌న‌వంతు మ‌ద్ద‌తు సినిమాకు ఇస్తే ఇంకా బాగుండు.



మరింత సమాచారం తెలుసుకోండి: