ఎంతో మంది తమిళ హీరోలు ఇప్పటి వరకు తమిళ భాషలో సినిమాలను తెరకెక్కించి, ఆ సినిమాలను అక్కడ విజయాలు సాధించిన తర్వాత , లేకపోతే ఆ హీరోకు ఉన్న ఇమేజ్ ను బట్టి నేరు గానో తెలుగు లోనూ విడుదల చేస్తూ ఆ సినిమాలతో మంచి స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోలు ఎంతోమంది ఉన్నారు. అలా తమిళనాట సినిమాలలో నటిస్తూ ఆ సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తూ టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోలలో శివ కార్తికేయన్ ఒకరు. ఈ హీరో రేమో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి, ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ క్రేజ్ ను అలాగే కంటిన్యూ చేసుకోవడం  కోసం శక్తి , జాగో, సీమరాజా వంటి పలు చిత్రాలను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశాడు. ఈ చిత్రాలతో టాలీవుడ్ లోను శివకార్తికేయన్ మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

ఇలా తెలుగునాట హీరోగా తనకంటూ ఒక మంచి ఇమేజ్ సంపాదించుకున్న శివ కార్తికేయన్ తాజాగా నటిస్తున్న డాక్టర్ సినిమాను కూడా తెలుగులో విడుదల చేయబోతున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శివ కార్తికేయన్ ప్రొడక్షన్, కె ఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ చిత్రబృందం తాజాగా పెద్ద ఎత్తున రిలీజ్ వేడుకలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా శివ కార్తికేయన్ మాట్లాడుతూ థియేటర్లలో విజిల్స్ గోలలు విని చాలా రోజులు అవుతుంది. అలాంటి సందర్భం మళ్లీ వచ్చింది అంటూ తెలియజేశాడు. డాక్టర్ సినిమాను అక్టోబర్ 9వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో శివ కార్తికేయన్ ఎలాంటి విజయాన్ని సాధిస్తాడో తెలియాలంటే ఈ సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: