టాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్స్‌లో కాజల్ అగర్వాల్ ఒకరని అందరికి తెలుసు. 2004 లో ఒక హిందీ సినిమాలో చిన్న పాత్రలో మెప్పించిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత మూడేళ్లకు 2007లో లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైన సంగతి అందరికి తెలిసిందే.

సినిమా తర్వాత కాజల్ అగర్వాల్ అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదని తెలుస్తుంది. దాదాపు 17 ఏళ్లుగా ఈ అమ్మడు సినిమాలతో అలరిస్తుందని సమాచారం. వయస్సు పెరుగుతున్నా కూడా అందాలు  ఏ మాత్రం తగ్గడం లేదని సినిమా అవకాశాలు కూడా అంతకంత పెరుగుతూనే ఉన్నాయని తెలుస్తుంది.టాలీవుడ్ సినీ పరిశ్రమలో దాదాపు టాప్ పొజిషన్ లో ఉన్న అందరిపైన ఏదో ఒక విధంగా నెగిటివ్ కామెంట్స్ రావడం అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ బ్యూటీపై మాత్రం పెద్దగా నెగిటివ్ వార్తలు రావని తెలుస్తుంది. దాదాపు అన్ని వర్గాల ప్రేక్షకులు కాజల్ అగర్వాల్ ని లైక్ చేస్తూ ఉంటారని అందరికి తెలిసిందే..

2020 అక్టోబర్ 30న కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లును అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య వివాహం చేసుకుందని అందరికి తెలిసిందే. ఆ తరువాత ఎక్కువ సమయం తీసుకోకుండా భర్తతో పాటే షూటింగులకు కూడా వచ్చేసిందని సమాచారం. ఇప్పుడైతే కాజల్ కొంతకాలం ఎలాంటి కొత్త ప్రాజెక్ట్‌లపై సంతకం చేసే ఆలోచనలో లేదని వార్త వినిపిస్తుంది. అందుకు కారణం కాజల్ తల్లి కాబోతుండడమే అని అంటున్నారని సమాచారం.

కాజల్ గురువారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ముఖ్యమైన అనౌన్స్‌మెంట్ త్వరలో వస్తుందని .. వేచి ఉండండి’ అని పేర్కొన్నట్లు సమాచారం. దాంతో ఈ అనౌన్స్‌మెంట్ దేని గురించోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో త్వరలో తను తల్లికాబోతున్న విషయాన్ని ప్రకటించనున్నారని కొందరు మాట్లాడుకుంటున్నట్లు సమాచారం.

కాజల్ అగర్వాల్ టాలీవుడ్ పరిశ్రమలో దాదాపు స్టార్ హీరోలందరి స్క్రీన్ షేర్ చేసుకుందని తెలుస్తుంది. అలాగే కోలీవుడ్ పరిశ్రమలో కూడా అందరి హీరోల ను కవర్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా తెలుగులోనే బాక్సాఫీస్ హిట్స్ అందుకుందని తెలుస్తుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ లో రెండు తరాల తో కలిసి నటించడం గొప్ప విషయమనే చెప్పాలి.తెలుగులో ఏ హీరోయిన్ కూడా ఆ తరహాలో రికార్డు అందుకోలేక పోయారని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: