ఒక హీరో త‌న టాలీవుడ్ సినిమా ల‌లో కామెడీ చేయ‌డం అనేది సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తోనే మొద‌లైంది. అది కూడా ఖ‌లేజా సినిమా తోనే మొద‌లైంది. ఈ సినిమా లో మ‌హేష్ బాబు కామెడీ పాత్ర హిట్ కావ‌డం తో టాలీవుడ్ చాలా మంది హీరో లు త‌మ సినిమాల‌లో కూడా కామెడీ పాత్ర ల‌ను పోషించ‌డం మొద‌లు పెట్టారు. ఈ సినిమా కు ముందు మహేష్ బాబు త‌న సినిమా ల‌లో చాలా సిరియ‌స్ గా ఉండే విధంగా క‌నిపించే వాడు. కానీ ఈ సినిమా తో మ‌హేష్ బాబు లో ఒక కోత్త కోణం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ కొత్త కోణం బ‌య‌ట కు తీసుకువ‌చ్చిన క్రెడిట్ మాత్రం డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కే చెందుతుంది. ఈ సినిమాలో మ‌హేష్ బాబు కామెడీ, డైలాగ్ డెల‌వ‌రీ అద్భుతంగా ఉంది. మ‌హేష్ బాబు కామెడీ టైమింగ్ చూసి చాలా మంది సినియ‌ర్ కామెడీయ‌న్ లు కూడా ఆశ్చ‌ర్య పోయారు.



అయితే ఈసినిమాను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌కత్వం వ‌చ్చింది. ఇయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ ది బెస్ట్ సినిమాల‌లో ఖ‌లేజా ఒక‌టి. అయితే ఈ సినిమా విడుద‌ల అయిన రోజుల్లో థీయేట‌ర్ల ల‌లో ఎక్కువ ఆడ‌క‌పోయిన‌.. ఇప్ప‌టికీ టెలివిజ‌న్ ల‌లో వ‌స్తే మాత్రం ఆ ఛాన‌ల్ టీఆర్పీ రేటింగ్స్ ఆమాంతం పెర‌గ‌డం ఖాయం. ఈ సినిమా కు, అలాగే కామెడీ క్లిప్ ల‌కు యూట్యూబ్ మంచి డిమాండ్ ఉంది. ఈ విడీయో ల‌కు యూట్యూబ్ లో వ్యూస్ మిలియ‌న్ లో ఉన్నాయి. ఈ సినిమా ను గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో శింగ‌న‌మ‌ల ర‌మేశ్‌, సి క‌ళ్యాణ్ నిర్మించారు. ఈ సినిమా 2010 లో వ‌చ్చిన ఇప్ప‌టికీ కూడా ఈ సినిమా క్రేజ్ త‌గ్గ‌లేదు. దీనికి కార‌ణం సూప‌ర్ స్టార్ మహేష్ బాబు కామెడీ టైమింగ్ అనే చెప్పాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: