ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు అందరూ కాసేపు హాయిగా నవ్వుకోవాలంటే చేసే పని ఒకటే. ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ ఎపిసోడ్స్ చూడటమే ప్రస్తుతం ప్రతి ఒకరిని కడుపుబ్బ నవ్విస్తూ ప్రతివారం కూడా కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది జబర్దస్త్ కార్యక్రమం. ఇక జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా అటు కమెడియన్స్ తమదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం బుల్లి తెరపై తిరుగులేని కామెడీ షో గా టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.



 అయితే జబర్దస్త్ లో టీం లీడర్గా ఉన్న అదిరే అభి.. ప్రతి వారం కూడా సరికొత్త స్కిట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాడు. ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక పోతే   వచ్చేవారం ఎపిసోడ్ లో కూడా అదిరే అభి సరికొత్తగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా ఈ సారి స్టేజ్ మీద ఒక్క అభి కాదు ఏకంగా ఇద్దరు అదిరే అభిలు కనిపించబోతున్నారు. అదేంటి షాక్ అయ్యారు కదా..  కానీ నిజంగానే స్టేజ్ మీద ఇద్దరు అదిరే అభి లు కనిపించబోతున్నారు  ఇటీవల విడుదలైన జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 ఇక ఈ ప్రోమో ఎప్పటిలాగానే సందడి సందడి గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ప్రోమో లో భాగంగా అదిరే అభి స్కిట్ వస్తుంది. ఇక ఈ స్కిట్ లో అదిరే అభి ఏకంగా డబుల్ రోల్ చేస్తున్నాడు.  ఒకేసారి స్టేజి మీద ఇద్దరు అదిరే అభి లు ఉండడంతో.. పక్కనే యాంకర్  సీట్లో కూర్చున్న అనసూయ సైతం ఒక్కసారిగా షాక్ అవుతుంది అని చెప్పాలి. అయితే ఓకే స్టేజీపై ఇద్దరు అభిలు ఎలా కనిపించారు అన్నది మాత్రం ప్రేక్షకులకు అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. ఇక అదిరే అభి స్కిట్ చూసిన జడ్జి రోజా అచ్చం కళ్ళకు కట్టినట్లు చూపించారు అంటూ కామెంట్ చేసింది. దీంతో అదిరే అభి స్కిట్  ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: