కొత్తగా ఇండస్ట్రీ కి వచ్చే అందరు హీరోలు ముందుగా ప్రయత్నం చేసే జనార్ కామెడీ. కాకపోతే అది చాలా తక్కువ మందికి వర్కౌట్ అవుతుంది. అలా తన కామెడీ స్టైల్ తో పైకి వచ్చిన హీరో రాజ్ తరుణ్. ఆయన మొదటి సినిమా ఉయ్యాల జంపాల ఒక ప్రేమ కథ. కానీ ఇందులో రాజ్ తరుణ్ చేసిన పల్లెటూరిలో అమయకత్వ కామెడీ ఈ సినిమాని యూత్ గా చేరువయ్యేలా చేసింది. ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ చేసిన సినిమా చూపిస్తామామా కూడా అదే పద్ధతి ని రాజ్ తరుణ్ ఫాలో అయ్యాడు సూపర్ హిట్ కొట్టాడు.

 ఇలా ప్రేమకథల్లో కామెడీని జోడించి వరసగా హిట్స్ కొడుతూ వస్తున్న రాజ్ తరుణ్ కి ఆ కామెడీ సినిమాలే పెద్ద సమస్య గా మారిపోయాయి. ఎందుకంటే ఎక్కువగా ఇలాంటి సినిమాలే చేయడంతో ఆయన ఇవి తప్ప ఇంకేం చేయలేడేమో అనే ముద్ర పడిపోయింది. ఇక వరసగా హిట్స్ లో రాజ్ తరుణ్ కి మెల్లగా ఫ్లోప్స్ రావడం మొదలయ్యాయి. అప్పుడు కోడాఆ రాజ్ తరుణ్ తన కామెడీ ని వదులుకోలేదు.ఈ మద్యనే ఆహా లో విడుదలైన ఒరేయ్ బుజ్జిగా సినిమా హిట్ అవ్వడంతో రాజ్ తరుణ్ మెల్లగా మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.

ఆయనకి హిట్ ఇచ్చింది కూడ కామెడీ సినిమానే. రాజ్ తరుణ్ కామెడీ అంతలా పండటానికి గల కారణం యాస. ఎలాంటి పాత్రకైనా తన వైజాగ్ యాసతో కలిపి మంచి కామెడీని పండిస్తారు. ఇక ప్రస్తుతం రాజ్ తరుణ్ స్టాండప్ రాహుల్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మిడిల్ క్లాస్ మెలోడీస్ తో మంచి పేరు సంపాదించుకున్న వర్ష భోల్లమ్మ ఈ సినిమాలో రాజ్ తరుణ్ కి జోడిగా నటిస్తుంది.స్టాండప్ కామెడీ కాన్సెప్ట్ మిద రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: