దర్శకధీరుడు రాజమౌళి, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'విక్రమార్కుడు'. రవితేజ కెరీర్‌లో సమ్‌థింగ్‌ స్పెషల్‌గా నిలిచిన ఈ సినిమాకి సీక్వెల్ సిద్ధమవుతోంది.  అయితే ఈ సీక్వెల్‌ కి రాజమౌళి దర్శకత్వం వహించలేదు. అలాగే రవితేజ కూడా నటించడం లేదు.  

విజయేంద్రప్రసాద్‌ అందించిన 'విక్రమార్కుడు' కథ తెలుగులోనే కాదు పక్క దేశాల్లోనూ రీమేక్ అయ్యింది. తమిళ్, కన్నడ, హిందీ, బెంగాళీతో పాటు బంగ్లాదేశ్ బెంగాళీ భాషలో కూడా ఈ సినిమాని రీమేక్‌ చేశారు. మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో క్రేజీ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమాకి సీక్వెల్‌ రాబోతోంది. విజయేంద్ర ప్రసాద్‌ కథ కూడా సిద్ధం చేశాడని తెలుస్తోంది.  

'విక్రమార్కుడు2' స్టోరీ అయితే సిద్ధం అయింది గానీ... ఈ సీక్వెల్‌ చేసేందుకు రాజమౌళి సిద్ధంగా లేడు. ఎందుకంటే ఈ దర్శకుడు ప్రస్తుతం 'ట్రిపుల్ ఆర్'తో బిజీగా ఉన్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్‌ పూర్తికాగానే మహేశ్‌ బాబుతో సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో జక్కన్న ఒక సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. దీంతో 'విక్రమార్కుడు2'ని సంపత్ నందికి అప్పగిస్తున్నారనే టాక్‌ వస్తోంది.

'విక్రమార్కుడు2'లో రవితేజ కూడా నటించడం కష్టమనే టాక్ వస్తోంది. ప్రస్తుతం ఈ హీరో 'ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలోనూ ఒక ప్రాజెక్ట్‌కి కమిట్ అయ్యాడు. సో ఇంత బిజీ షెడ్యూల్‌లో 'విక్రమార్కుడు2'కి వెంటనే కాల్షీట్స్‌ ఇవ్వడం సాధ్యపడటం లేదట.

రాజమౌళి, రవితేజ ఇద్దరూ సీక్వెల్ చెయ్యట్లేదు. దీంతో ఈ కథకి 'విక్రమార్కుడు2' కాకుండా మరేదైనా టైటిల్‌ పెట్టాలనుకుంటున్నారట మేకర్స్. మరి ఈ సీక్వెల్‌కి సంపత్‌ నంది ఎవరిని హీరోగా తీసుకుంటాడు.. కామెడీ కమ్ యాక్షన్‌ రెండూ చేయగల స్టార్‌ని ఎప్పటివరకు ఓకే చేసుకుంటాడో చూడాలి. చూద్దాం.. ఈ సిినిమా ఏ నటులతో తెరకెక్కుతుందో. ప్రేక్షకులు ఈ మూవీపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.







మరింత సమాచారం తెలుసుకోండి: