అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది,  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ కాజల్ అగర్వాల్ నటనకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగునాట మంచి ఆఫర్లే దక్కాయి. అయితే ఆ తర్వాత చందమామ సినిమాతో ఈ ముద్దుగుమ్మ నటనతో పాటు అందచందాలకు కూడా మంచి ప్రశంసలు దక్కడంతో తెలుగునాట కాజల్ అగర్వాల్ కు వరుస ఆఫర్లు దక్కాయి. అందులో భాగంగా రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకోవడంతో టాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ కు ఫుల్ క్రేజ్ దక్కింది. ఆ క్రేజ్ ను కంటిన్యూ చేస్తూ వరుస సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగింది. అలా టాప్ హీరోయిన్ గా కంటిన్యూ అయిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత కాలంలో కూడా మెగాస్టార్ చిరంజీవి వంటి సీనియర్ హీరోలతో కూడా నటించి మెప్పించింది. ఇలా కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే తమిళ , హిందీ భాషల  సినిమాల్లో  కూడా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇలా అనేక భాషలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న కాజల్ అగర్వాల్ ఈ మధ్యనే గౌతమ్ కిచ్లు అనే అబ్బాయిని ప్రేమించి పెళ్ళాడింది.

 కాజల్ అగర్వాల్ వివాహం తర్వాత కూడా తన భర్త అంగీకారంతో సినిమాలలో నటిస్తూ వచ్చింది. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు తెలుగులో నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఘోస్ట్ సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఎంపిక అయింది. అయితే కాజల్ అగర్వాల్ కు ప్రెగ్నెన్సీ రావడంతో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమా నుండి కాజల్ తప్పుకుంది అనేక వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఘోస్ట్ సినిమా నుండి కాజల్ అగర్వాల్ తప్పకుండా లేదా అనేదాని మీద చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తమిళంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న  రౌడీ బేబీ సినిమా నుండి కూడా కాజల్ అగర్వాల్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: