మా అసోసియేషన్  అధ్యక్ష ఎన్నికలపై జనసేన అధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు మరియు చిరంజీవి మంచి ఫ్రెండ్స్ అని మా ఎన్నికల నేపథ్యంలో వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని తేల్చి చెప్పా రు పవన్ కళ్యాణ్. మా ఎన్నికలు ఇంత హడావిడి అవసరం లేదని చెప్పిన పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే వాళ్ళు చాలా ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చా రు. మా ఎన్నికల కారణంగా చిత్ర పరిశ్రమ చీలడం అనే ప్రశ్నే లేదని కుండబద్దలు కొట్టారు పవన్ కళ్యా ణ్. మా సృష్టిని ఎన్నిక ల్లో ఇలాంటి పోటీ తానెప్పు డూ చూడలేదని.. ఎన్నికల కారణంగా నదుల మధ్య చీలిక రాదని చెప్పారు పవన్ కళ్యా ణ్.

కాగా.. మా అసోసి యేషన్ కు అధ్యక్షు డిగా పోటీ చేస్తున్నా రు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు.  మా అసోసియేషన్ లోని 26 మంది కార్యవర్గం కోసం 54 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా... ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నాం  2 గంటల వరకు పో లింగ్ జరుగ నున్న సంగతి విధితమే.  ఫిల్మ్ నగర్ లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో మా ఎన్నికల పోలింగ్ జరుగనుండగా... సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మా ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుందని అధికారులు చెప్పారు.  


20 మంది తెలంగాణ కో-అపరేటివ్ సొసైటీ విశ్రాంత ఉద్యోగులతో పోలింగ్ నిర్వహణ జరుగనుండగా... 30 ఏళ్లుగా వివిధ రకాల ఎన్నికలను నిర్వహిస్తున్నారు కో-ఆపరేటివ్ సొసైటీ విశ్రాంత ఉద్యోగులు. మా ఎన్నికలకు 50 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయగా... మా ఎన్నికల్లో 10 పేజీలతో కూడిన బ్యాలెట్ పేపర్ ఏర్పాటు చేశారు.  పదవులకు అనుగుణంగా వివిధ రంగుల్లో బ్యాలెట్ పేపర్ ముద్రణ చేశారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: