మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ( మా ) ఎన్నికల పర్వం ఆది వారంతో చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. అధ్యక్ష పదివికోసం నటులు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ చేస్తుండ‌గా.. మ‌రో 26 ప‌ద‌వుల‌కు మొత్తం 54 మంది పోటీ చేస్తున్నారు. ఇక అటు ప్ర‌కాష్ రాజ్‌కు మెగా కాంపౌండ్ స‌పోర్ట్ ఉండ‌డం.. ఇటు విష్ణుకు సీనియ‌ర్ల మ‌ద్ద‌తు ఉండ‌డంతో చివరికి ఎవరు నెగ్గుతారో అనే ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే పోలింగ్ లో రిగ్గింగ్ జ‌రుగుతుంద‌న్న ఆరోప‌ణ ల‌తో ప్ర‌స్తుతం పోలింగ్‌ను నిలిపి వేశారు.

అక్క‌డ నటులు శివారెడ్డి, సమీర్ కు మధ్య వాగ్వాదం జరిగింది. శివారెడ్డి న‌మూనా బ్యాలెట్ ల‌ను పంచుతున్నారంటూ విష్ణు వ‌ర్గం ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గానికి చెందిన వారిపైకి దూసుకు వెళ్లింది. దీంతో అక్క‌డ మాటా మాటా పెర‌గ‌డంతో చివ‌ర‌కు కొట్టుకునే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది. పోలీసులు ఇరు వ‌ర్గాల వారిని దూరంగా పంపేసినా ప‌రిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.

రిగ్గింగ్ జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఎన్నిక‌ల అధికారులు స్పందించారు.  సీసీ టీవీ ఫూటేజ్ పరిశీలిస్తున్నాం, రిగ్గింగ్ జరిగినట్టు తేలితే ఫలితాలు ప్రకటించమ‌ని చెప్పారు. ఇక ఎన్నిక‌ల అధికారులు రెండు ఫ్యానెల్స్ తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. దీంతో పోలింగ్ కంటిన్యూ అవుతుందా ? ఇక్క‌డితో ఆపేస్తారా ? అన్న సందిగ్ధ‌త అయితే నెల‌కొంది. మ‌రో వైపు ఫలితాలు ప్ర‌క‌టించ కుండా హైకోర్టుకు వెళ‌తామ‌ని మోహ‌న్ బాబు వ‌ర్గం చెపుతోంది.

ఇక ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు పోలింగ్ ముగిసింది. మెగాస్టార్ చిరంజీవి - పవన్ కళ్యాణ్ - సాయి కుమార్ - మెగా ప‌వ‌ర్ స్టార్‌ రాం చరణ్ - పోసాని కృష్ణ మురళి - మంచు లక్ష్మీ - శ్రీకాంత్ - వీ కే నరేశ్ - శివ బాలాజీ -  ఉత్తేజ్ తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించు కున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: