తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  ఊహించిన దాని కంటే  పెద్ద విజయాన్ని సాధించి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది.  బాహుబలి సినిమా తర్వాత అటు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. మరోవైపు రాజమౌళి  వరల్డ్ వైడ్ గా మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు రాజమౌళిసినిమా తెరకెక్కిస్తున్న కూడా దానిపై ఊహించని రేంజ్ లోనే అంచనాలు రోజురోజుకు పెరిగి పోతూనే ఉన్నాయి.



 కాగా ప్రస్తుతం ఇక రాజమౌళి మరో భారీ ప్రాజెక్టు తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అయినా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి.  ఇక ఈ సినిమా గురించి కూడా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమాకు ముందు కొంతమంది కొత్త హీరోలతో కూడా సినిమాలు తీసి హిట్ అందుకున్నాడు. కానీ బాహుబలి తర్వాత రాజమౌళి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో జక్కన్న మళ్లీ కొత్త హీరోలతో సినిమాలు తీస్తారా లేదా అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారింది.



 అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో రాజమౌళికి దీని గురించి ప్రశ్న ఎదురు కాగా ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చారు జక్కన్న.  బాహుబలి తర్వాత బాగా ఫేమ్ వచ్చింది ఇక ఇప్పుడు కొత్త హీరోలతో సినిమా చేస్తారా అని అడగగా.. నేను సినిమాలు తీసేటప్పుడు ఎప్పుడూ ఈ హీరోని పెట్టుకోవాలి అని ఆలోచించను..  ఆ కథకు ఏ హీరో అయితే బాగుంటాడో అతన్నే పెట్టుకుంటాను..  కథకు సెట్ అయ్యే హీరో అప్పటికే స్టార్ హీరో అయినా..  లేదా అప్పుడే వచ్చిన కొత్త హీరో అయినా నాకు నో ప్రాబ్లం కానీ నా కథలోని పాత్రలకు మాత్రం అతను బాగా సరిపోవాలి అంటూ చక్కని సమాధానం చెప్పాడు.  కొత్త హీరో ని పెట్టుకోవాలపించే కథలు వస్తే కొత్త హీరోతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అందుకే ఆయన స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: