మా పోరు లో మంచు విష్ణు అధ్యక్ష పదవికి ఎన్నికయ్యాడు. మా సభ్యుల నమ్మకాన్ని గెలిచి ఈరోజు ఆయన మా అధ్యక్ష పదవిని చేపట్టనున్నాడు. తన గెలుపుకు ప్రధాన కారణంగా ఎన్నో విషయాలు ఉన్నాయని చెప్పవచ్చు. మొదటి నుంచి ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా మంచు విష్ణు తనదైన నీతి తో ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. చివరకు అదే ఆయనకు మంచి విజయాన్ని చేకూర్చేలా చేసింది. మంచు విష్ణు గెలుపు కు  ప్రధాన కారణాలు ఏవి అంటే ఆయన నిజాయితీ అలాగే మా సభ్యుల పట్ల ఆయన చేసిన కృషి అని చెప్పవచ్చు.

మా ఎలక్షన్స్ లో ఆయనకు ప్రధానంగా నందమూరి అభిమానులు కలిసి వచ్చారు అని చెప్పవచ్చు.  నందమూరి బాలకృష్ణ ఆయనకు మద్దతు ఇస్తున్నట్లుగా మొదట్లోనే చెప్పగా మా సభ్యుల లోని చాలా మంది నందమూరి అభిమానులు విష్ణు కు సపోర్ట్ గా నిలిచి ఆయన విజయానికి కారణం అయ్యారు. అలాగే లోకల్ నాన్ లోకల్ అనే విషయం కూడా ఈ ఎన్నికలపై ప్రభావం చూపించిందని చెప్పవచ్చు. ఎంత లేదన్నా మన తెలుగు వారు లోకల్ వ్యక్తులులను ఎక్కువగా నమ్ముతారు అనే విషయం ఈ ఎన్నికలతో మరొక సారి రుజువు అయింది.

అంతేకాదు ఎక్కడెక్కడి నుంచో ఓటర్ల ను సైతం తీసుకువచ్చి వారికి ఓటు వేసే వీలును కల్పించాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 600 పైచిలుకు ఓట్లు నమోదయ్యే విధంగా రికార్డు స్థాయిలో ఓట్లు వేశారు అంటే దానికి ముఖ్య కారణం మంచు విష్ణు అండ్ టీమ్ చేసిన కృషి అని చెప్పవచ్చు. మహారాష్ట్ర నుంచి వచ్చి జెనీలియా వంటి వారు వచ్చి ఓటు వేయడం లో కీలక పాత్ర వహించాడు విష్ణు. ఆ విధంగా మంచు విష్ణు గెలుపుకు ప్రధాన కారణాలు ఇవి కాగా ఆయన మా బిల్డింగ్ కట్టిస్తాం అని చెప్పడం కూడా ఆయన గెలుపుకు ముఖ్య కారణం అయ్యింది. మరి ఆయన చేసిన వాగ్దానాలను ఏ విధంగా నిలబెట్టుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: