అక్కినేని వారసుడు అక్కినేని అఖిల్  ‘ఏజెంట్’గా హంగేరీకి వెళ్ళడానికి సిద్ధమవ్వడం జరిగింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో హై బడ్జెట్ స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న ‘ఏజెంట్’ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉంది.ఇక ఈ సినిమా కోసం అఖిల్ లుక్ మార్చేసాడు. ఈ లుక్ తో సరికొత్త బాడీ ట్రాన్స్ఫర్మేషన్ లోకి మారిన అఖిల్ ఖచ్చితంగా ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా నిలుస్తాడట. ఈ రఫ్ లుక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది. ఇక ఇప్పటికే “ఏజెంట్” చిత్ర బృందం నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు ఇంకా వైజాగ్ పోర్టు అలాగే హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలలో వంటి ప్రాంతాల్లో కొన్ని కీలకమైన షెడ్యూల్‌లను పూర్తి చేయడం అనేది జరిగింది.ఇక మెయిన్ యూనిట్ యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ కోసం హంగేరి రాజధాని అయినా బుడాపెస్ట్‌కు వెళ్లడానికి రెడీగా ఉంది.

ఇక అలాగే తాజా అప్‌డేట్‌ల ప్రకారం ‘ఏజెంట్’ సినిమా బుడాపెస్ట్ షెడ్యూల్ అక్టోబర్ 20 తేదీ నుండి ప్రారంభమవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఈ ‘ఏజెంట్‌’ సినిమాలో అఖిల్ కి జోడీగా సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది.ఇక ఈ సినిమాని అనిల్ సుంకర నిర్మిస్తుండగా ప్రముఖ రచయిత ఇంకా దర్శకుడు వక్కంతం వంశీ స్క్రిప్ట్ రాయడం జరిగిందిఇక ఇదిలా ఉండగా మరోవైపు అఖిల్ నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇక హాట్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అక్టోబర్ 15 వ తేదీన విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాపై అఖిల్ తో సహా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా హిట్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా తప్పకుండా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇక దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: