కన్నడ సినీ ప్రపంచానికి విశేష కృషి చేసిన ప్రముఖ నటుడు సత్య జీత్ ఇకలేరు. కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యతో బోరింగ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సత్యజిత్ (71) ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. హీరో సాయి కుమార్ నటించిన 'పోలీస్ స్టోరీ ' లో బ్లాక్ కాప్ గా సుపరిచితుడు. కన్నడ లోనే కాకుండా తెలుగు లో వచ్చిన అనేక డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మెప్పించాడు. 71 ఏళ్ళ సత్య జీత్ కాలిగాయం ఇంకా కామెర్ల తో బోరింగ్ హాస్పిటల్ లో చేరారు. చికిత్స పొందుతూ ఉండగానే ఆయనకి గుండె పోటు రావడం తో ఐసియు కి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ అయన ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు , కుటుంబ సభ్యులు తెలిపారు.

IHG

సత్య జీత్ అసలు పేరు సయ్యద్ నిజాముద్దీన్ సత్యజిత్. పదవ తరగతి వరకు చదువుకున్న సత్యజిత్ సినిమాల పై మక్కువ తో సినిమా ఇండిస్టీకి వచ్చారు. 1986 లో వచ్చిన అరుణ రాగ అనే సినిమాతో కన్నడ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. సినిమాల్లో విలన్ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. అయన ఇప్పటి వరకు 650 సినిమాలకు పైగా నటించారు. అయినప్పటికీ ఆర్ధికంగా చాల వెనుక బడిన కుటుంబం. కొద్దీ రోజుల క్రితం కామెర్లు , గుండెపోటు ఇలా పరిస్థితి విషమించడం తో సత్య జీత్ కుటుంబీకులు కన్నడ ప్రభుత్వానికి , కన్నడ ఫిలిం ఛాంబర్ నుండి ఆర్థిక సహాయం కోరారు. వారినుండి సహాయం అందే లోపే అయన కన్ను మూశారు. అయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు .


IHG

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడం తోపాటుగా నెగటివ్ పాత్రలతో అలరించాడు కూడా . శివ అప్రిసియేటెడ్ కన్నప్ప, పటేల్, దుర్గా టైగర్ , రంగరంగ, అరుణరాగా, మాండ్యాస్ మేల్, పోలీస్ స్టోరీ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఫైనల్ వెర్డిక్ట్, నమ్ముర రాజా, జస్టిస్ ఫర్ మి, తదితర హిట్ సాధించిన సినిమాల్లో నటించారు. తెలుగులోనూ సూపర్ హిట్ అయినటువంటి పోలీస్ స్టోరీలో బ్యాడ్ కాప్ గా సత్యజిత్ పాత్ర అందరికీ గుర్తు ఉండిపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: