హోరాహోరీగా సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు చివరికి ప్రశాంతంగా ముగిశాయి. గొడవలు, వాగ్వాదాలు, ఆరోపణలు, ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ చివరకు ఎన్నికలు పూర్తయ్యే సమయానికి అంతా ప్రశాంతం అనిపించుకున్నారు. 'మా' అధ్యక్ష పీఠాన్ని మంచు విష్ణు కైవసం చేసుకున్నాడు. తిరుగులేని మెజారిటీ సాధించి శభాష్ అనిపించుకున్నారు. సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ వచ్చినా.. మంచు విష్ణు మాత్రం వాటిని అస్సలు పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయారు. చివరకు మంచు విష్ణు పడిన కష్టానికి ఫలితం లభించింది. ఇంతవరకూ ఎవరూ సాధించని మెజారిటీని, విష్ణు సాధించి.. ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ సత్తా రుజువు చేశారు.

ఇక ప్రకాష్ రాజ్ విషయానికి వస్తే.. ప్యానల్ లో ఎక్కువమంది గెలిచినప్పటికీ, ఆయన మాత్రం ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మెగా ఫ్యామిలీ అండదండలున్నాయని అనుకున్నా విజయం మాత్రం వరించలేదు. ఎన్నికల వేళ ప్రత్యర్థి ప్యానల్ పై ఘాటుగానే విమర్శలు చేసిన ప్రకాష్ రాజ్ పరిస్థితి ఏమిటన్నదే.. ఇప్పుడు అందరి ఆలోచన. ఇండస్ట్రీపై పెత్తనం అంతా మంచు విష్ణు చేతికి వచ్చేస్తుందని చెప్పలేం కానీ.. మంచు ఫ్యామిలీ హవా మాత్రం కచ్చితంగా ఉంటుంది. అయితే విష్ణు ఎన్నికల విషయం మర్చిపోయి ప్రకాష్ రాజ్ తో మామూలుగానే ఉంటారా.. లేక ఎన్నికల విషయాన్ని మనసులో పెట్టుకొని ప్రవర్తిస్తారా అనేది చూడాలి.

గతంలోనూ ప్రకాష్ రాజ్ పై ఒకసారి టాలీవుడ్ నిర్మాతల మండలి బ్యాన్ విధించింది. దీంతో కొంతకాలం ఆయన తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ.. తిరిగి ప్రకాష్ రాజ్ తెలుగు తెరపై కనిపించారు. తనను ఘోరంగా ఓడించిన తెలుగు ఇండస్ట్రీపై ప్రకాష్ రాజ్ అలుగుతాడా..? లేక ఇవేమీ పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటాడా అనే విషయంలోనూ ఇంకా క్లారిటీ రాలేదు. అయితే మా అసోసియేషన్ కోసం ప్రకాష్ రాజ్ ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఓటిమి కారణంగా ఆయన చేయాలనుకున్న పనులను, అధ్యక్ష పీఠంపై కూర్చున్న విష్ణుతో కలిసి చేస్తాడా లేదా..? అనేది కూడా ఎవరికీ తెలియని విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: