జూనియ‌ర్ ఎన్టీఆర్ చిత్ర ప‌రిశ్ర‌మ ప‌రిచ‌యం అయిన త‌ర్వాత మొద‌ట్లో ల‌వ్ స్టోరీ సినిమా లే చేసేవాడు. కానీ స్టార్ హీరో కావ‌లంటే లవ్ స్టోరీ ల కంటే మాస్ సినిమా లే చేయాల‌ని ఎన్టీఆర్ స్నేహితుడు కొడాలి నాని స‌ల‌హా ఇవ్వ‌డంతో వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆది సినిమా ను చేశాడు. ఈ సినిమా తోనే జూనియ‌ర్ ఎన్టీఆర్ కు మంచి గుర్తింపు వ‌చ్చింది. సీనియ‌ర్ ఎన్టీఆర్ గుర్తు కు వ‌చ్చేలా జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌ట‌న ఉంద‌ని సినిమా విశ్లేష‌కులు అన్నారు. ఈ సినిమా లో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ ఇప్ప‌టి కే పాపులార్ గానే ఉన్నాయి. ఈ సినిమా హిట్ త‌ర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్ చాలా నే ఫ్యాక్ష‌న్ సినిమాలు తీశాడు. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్స్ తో పాటు ఫ్యాక్ష‌న్ సీన్స్, కార్లు గాల్లో లేవ‌డం, కొన్ని ఫైట్ సీన్ వంటి విసినిమా హిట్ కావ‌డానికి ఎంతో ఉప‌యోగ ప‌డ్డాయి.



ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీ గా కీర్తి చావ్లా న‌టించింది. ఈ సినిమా లో కొంత వ‌ర‌కు ల‌వ్ స్టోరీ ని కూడా జ‌త  చేశాడు. ఈ ల‌వ్ స్టోరీ కూడా సినిమా కు కాస్త ప్ల‌స్ అయింది. ఈ సినిమాలో తన తండ్రి ఆస్తి ని విలాన్ క‌బ్జ చేస్తాడు. అలాగే హీరో త‌ల్లిదండ్రుల‌ను హ‌త్య చేస్తాడు. దీంతో ఎన్టీఆర్ పెద్ల అయ్య‌క వ‌చ్చి త‌న ఆస్తి ని తిరిగి తీసుకుని పేద ప్ర‌జ‌ల‌కు పంచుతాడు. ఇలా క‌థ సాఫీ గా సాగుతుంది. అయితే ఈ సినిమా లో కొన్ని ట్వీస్ట్ లు కూడా ఉంటాయి. మొద‌ట సాధార‌ణ విద్యార్థి లాగా ఉండి ఒకే సారి ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ గా ఎన్టీఆర్ మారిపోతాడు. అలాగే ఈ సినిమా నుంచే సూమో లు గాల్లో లెవ‌డం వివి వినాయ‌క్ త‌న ప్ర‌తి సినిమాలో చూపించాడు.




మరింత సమాచారం తెలుసుకోండి: