తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఎన్నో సినిమాలో అద్భుతముగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె అప్పట్లో స్టార్ హీరోలకి దీటుగా సినిమాలలో నటన డాన్సులు చేస్తూ ఎంతో మంది అభిమానుల ప్రేమానురాగాలను సొంతం చేసుకున్నారు. అంతేకాదు.. లేడి ఓరియెంటెడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోలతో సమానంగా ఫైట్స్ చేస్తూ ధీటుగా నిలబడింది. అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈమె అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నిక్కేవ్వరు సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ఎంట్రీ ఇచ్చారు.

అయితే విజయశాంతి సినిమా కెరియర్ లో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. ఆ తర్వాత రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టారు. కాగా.. ఆమె రాజకీయాల్లో పెద్దగా గుర్తింపు పొందలేకపోయినప్పటికీ తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది ఈ సూపర్ స్టార్ విజయశాంతి. అంతేకాదు.. విజయశాంతి రీ ఎంట్రీ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఇందులో విజయశాంతి పాత్ర కూడా ఎంతో కీలకమైనది అనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అంతేకాక.. విజయశాంతి వ్యక్తిగత విషయానికి ఈమెకు పిల్లలు ఉన్నారంటూ అయితే వారిని ప్రపంచానికి పరిచయం చేయలేదని పెద్దఎత్తున వార్తలు వినపడుతున్నాయి. విజయశాంతి పిల్లలు ఉన్న సంగతిని ఎందుకు బయట పెట్టలేదనే విషయం అప్పట్లో చర్చనీయాంశంగా ఉన్న అందరిలో సందేహాలను కలగజేశాయి. అంతేకాదు.. ఒకానొక సమయంలో విజయశాంతి తన ఆస్తులు అన్నింటిని ఒక ఆశ్రమానికి దానం చేసినట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో అందరికీ ఆమె పిల్లల విషయం గురించి ప్రశ్నార్థకంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఒకవేళ ఈమెకు పిల్లలు ఉంటే ఎందుకు లోకానికి పరిచయం చేయలేదన్న సందేహాలు కూడా పలువురికి వస్తూనే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: