మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్.. విభిన్న కథలను ఎంచుకుంటూ నటుడిగా తన సినిమాల ద్వారా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.ఇక ఇప్పటికే గద్దల కొండ గణేష్, ఎఫ్2 సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ ను సొంతం చేసుకొని మంచి ఫామ్ లో ఉన్నాడు ఈ మెగాప్రిన్స్.ఇక ప్రస్తుతం ఈ మెగా హీరో కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో 'గని' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.డిసెంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ టీజర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.అయితే వరుణ్ తేజ్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో చాలా టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో వరుణ్ తేజ్ నటించిన సినిమాలు కొన్ని డిసెంబర్ నెలలో విడుదలై..బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి.వరుణ్ తేజ్ మొదటి సినిమా అయిన ముకుంద 2014 వ సంవత్సరం డిసెంబర్ 24 వ తేదీన విడుదల కాగా..ఆ సినిమా ప్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ కూడా 2015  డిసెంబర్ 17 న విడుదలైంది.అదికూడా ఆడియన్స్ ని మెప్పించలేదు.ఇక 2018 వ సంవత్సరం డిసెంబర్ 28 న అంతరిక్షం సినిమా విడుదల అయింది.ఈ సినిమా కూడా ఆశించిన విజయన్ని రాబట్టలేదు.

ఇలా వరుణ్ తేజ్ కెరీర్లో డిసెంబర్ నెలలో విడుదలైన ఈ మూడు సినిమాలు ఎన్నో అంచనాల నడుమ విడుదలై..ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు.ఇక ఇప్పుడు నాలుగో సారి ఈ హీరో నటిస్తున్న 'గని' సినిమా కూడా డిసెంబర్ నెలలోనే విడుదలకు సిద్ధం అయ్యింది.మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.మరి వరుణ్ తేజ్ డిసెంబర్ సెంటిమెంట్ ని 'గని' సినిమా బ్రేక్ చేస్తుందా? లేక అది కూడా అదే లిస్ట్ లో చేరుతుందా అనేది చూడాలి.ఇక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తో పాటు కన్నడ హీరో ఉపేంద్ర సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: