అప్పటికే సునీల్ హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. మరోవైపు టాలీవుడ్ లోనే నెంబర్ వన్ దర్శకుడిగా ఉన్నాడు. రాజమౌళి మగధీర వంటి సూపర్ హిట్ సినిమా చేసిన తర్వాత ఆయన ఓ చిన్న సినిమా చేసి ప్రేక్షకులను అలరించాలని భావించారు. ఈ నేపథ్యంలోనే ఆయన సునీల్ తో కలసి మర్యాద రామన్న సినిమా చేయడం ఒక్కసారిగా అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది. సునీల్ లాంటి కమెడియన్ తో రాజమౌళి లాంటి దర్శకుడు సినిమా ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు.

కానీ తన కథకు సరిగ్గా సూటయ్యే హీరోగా సునీల్ ను ఎంచుకోవడం తో ఆయన తో మర్యాద రామన్న సినిమా చేసి తన ఖాతాలో మరో సూపర్ హిట్ ను వేసుకున్నాడు రాజమౌళి. ఆర్కా మీడియా పతాకంపై యార్లగడ్డ శోభు దేవినేని ప్రసాద్ నిర్మించిన మర్యాదరామన్న చిత్రం 2010వ సంవత్సరం లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది.  సలోని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించాడు.

తన ఇంటి గడప దాటెంత వరకు అతిధి గా వచ్చిన వాడు బద్ధ శత్రువు అని తెలిసిన కూడా ప్రాణం తీయడు ఒక ఇంటి పెద్ద. అలా తన ఇంట్లోకి వచ్చిన వచ్చిన చిరకాల శత్రువు ను ఎలా చంపాలనుకున్నాడు. తన శత్రువు ఇంటికి వచ్చాను గడప దాటితే చస్తాను అని తెలుసుకున్న హీరో ఎలా ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా తన చావు నుంచి తప్పించుకోగలిగాడు అనేదే ఈ సినిమా కథ.  హీరో గా రెండో సినిమానే అయినా సునీల్ తన స్టైల్లో ఈ చిత్రం లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. భయంతో. కూడా కామెడీని పండించవచ్చు అని నిరూపించాడు. ఫ్యాక్షనిజం లోనే వెరైటీ చిత్రంగా మర్యాద రామన్న చిత్రాన్ని తెరకెక్కించి రాజమౌళి దర్శకుడిగా తనకు ఏ అంశం ఇచ్చిన దాన్ని తప్పకుండా సినిమా చేస్తానని చాటి చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: