సినీ ఇండస్ట్రీకి సంబంధించిన మా ఎన్నికలు నిన్న జరిగిన విషయం తెలిసిందే.ఈసారి ఎన్నికలకు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు అంతా హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అయితే కొందరు నటులు మాత్రం షూటింగ్స్ బిజీగా ఉండి..హైదరాబాద్ లో లేకపోవడంతో ఎన్నికలకు రాలేకపోయారు.కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం హైదరాబాద్ లోనే ఉన్నా కూడా ఈ ఎన్నికలకు రాలేదు.దీంతో తారక్ ఎందుకు రాలేదు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ ఎన్నికలకు రాకపోయేసరికి టాలీవుడ్ ఇండ్రస్టీ లో కొన్ని చర్చలు జరుగుతున్నాయి.

ఎన్టీఆర్ కి ప్రస్తుత పరిణామాలు నచ్చలేదని..అందుకే ఓటు వేయమని ఇటీవల జీవితా రాజశేఖర్ మీడియా వేదికగా తెలిపారు.దీంతో ఈ వార్త వైరల్ అయ్యే సరికి ఇండ్రస్టీ లో చర్చలు ఎక్కువయ్యాయి. అయినా కూడా ఎన్టీఆర్ ఓటు వేయడానికి రాలేదు.దీంతో మంచు విష్ణు రియాక్ట్ అయి..తన తమ్ముడు ఎన్టీఆర్ తో మాట్లాడానని..పోలింగ్ కి వచ్చి ఓటు వేస్తానని తనకు మాట ఇచ్చాడని తెలిపాడు.ఇక అటు ప్రకాష్ రాజ్ కూడా ఎన్టీఆర్ గురించి స్పందిస్తూ..బంగారం తో తాను మాట్లాడానని,ఓటు వేయనని చెప్పడం తప్పు అని సర్ది చెప్పా అన్నాడు.ఇలా ఎన్టీఆర్ పై ఇంత చర్చ జరుగుతున్నా..ఆయన మాత్రం తన ఇష్ట పూర్వకంగానే..

 ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇక మరో విషయం ఏమిటంటే అసోసియేషన్ లో స్టార్ హీరోలు ఓటు వేసిన విషయం బయటికి తెలిసిపోతుంది.దీంతో ఎన్టీఆర్ ఓటు వేసి వచ్చిన తర్వాత జరిగే వివాదాల పరిణామాలకు దూరంగా ఉండాలని అనుకొనే అలా డిసైడ్ అయ్యాడని అంటున్నారు.మరోవైపు మెగా, మోహన్ బాబు కాంపౌండ్ కి దూరంగా ఉండాలని.. కాబట్టి వచ్చి ఓటు వేసి వాదనలు ఎదుర్కోవడం కంటే సైలెంట్ గా ఉంటేనే బెటర్ అని ఎన్టీఆర్ అనుకున్నట్లు తెలుస్తోంది.  అయితే ఎన్టీఆర్ తో పాటు మరికొందరు స్టార్ హీరోలు కూడా ఓటు వేయడానికి రాలేదు.అయినా కూడా ప్రస్తుతం ఎన్టీఆర్ గురించే ఇండ్రస్టీ లో చర్చలు జరుగుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: