టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ దర్శకుడిగా ఎస్. ఎస్. రాజమౌళికి ఎలాంటి స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక ఇటీవల బాహుబలి తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు జక్కన్న. అయితే రాజమౌళి వ్యక్తిగత జీవితానికి వస్తే..ఈయన అసలు పేరు కోడూరి శ్రీశైల రాజమౌళి కాగా..రాజమౌళిని అందరూ జక్కన్న అని పిలుస్తారు.ఏలూరులో నాలుగవ తరగతి నుండి ఏడో తరగతికి ప్రమోట్ అయ్యాడు.అయితే స్కూల్ రికార్డుల్లో మాత్రం రాజమౌళి పేరు మాత్రం విజయ అప్పారావు అని ఉండేది.జక్కన్న తాత గారి పేరు విజయ అప్పారావు కాగా..అదే పేరు తన స్కూల్ రికార్డులలో ఉండటం రాజమౌళికి అస్సలు నచ్చేది కాదట.

స్నేహితులు కూడా తనను రాజమౌళి అని పిలవకుండా అప్పారావు అని పిలవడంతో జక్కన్న హర్ట్ అయ్యేవారట.ఒక విధంగా తన చదువు ఆపడానికి పేరు కూడా ఒక ప్రధాన కారణమే అని స్వయంగా రాజమౌళి ఓ సందర్భంలో తెలిపాడు.ఇక రాజమౌళి ఇంటర్ చదివే సమయానికి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచయితగా చెన్నై కి షిఫ్ట్ అయ్యారు.ఇక ఆ తర్వాత తన తండ్రి దగ్గర అసిస్టెంట్ గా చేరిన జక్కన్న..కొద్ది కాలం తర్వాత దర్శకుడు కావాలని అనుకున్నారు.అప్పుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు.అక్కడి నుండి ఎంతో కష్టపడి..ప్రపంచం మెచ్చే దర్శకుడిగా ఎంతో గొప్ప స్థాయికి చేరుకున్నారు రాజమౌళి.

ఇక తన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ ని జూనియర్ ఎన్టీఆర్ తో చేసి.. హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత సింహాద్రి, సై, ఛత్రపతి,మగధీర, విక్రమార్కుడు, యమదొంగ,మర్యాద రామన్న.ఇలా వరుస విజయాలను సొంతం చేసుకున్నాడు.ఇక ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో 'రౌద్రం,రణం, రుధిరం' అనే భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7 న ప్రపంచ వ్యాప్తంగా సుమారు పది భాషల్లో విడుదల కానుంది.డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవగన్, ఆలియా భట్, శ్రీయా శరన్, సముద్రం ఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: