శ్రుతి హాసన్‌ బయటకు చెప్పడం లేదు కానీ... నెటిజన్లు మాత్రం రకరకాలుగా ఊహించేసుకుంటున్నారు. త్వరలోనే గుడ్‌ న్యూస్ చెప్పబోతోందని మాట్లాడుకుంటున్నారు. శ్రుతీ లైఫ్‌లో కొత్త చాప్టర్ స్టార్ట్ కాబోతోందని కామెంట్ చేస్తున్నారు. శ్రుతీ హాసన్‌ లైఫ్‌లో మార్పులు రాబోతున్నాయని మాట్లాడుకుంటున్నారు.

శ్రుతీ హాసన్‌ కొన్నాళ్లుగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో లవ్‌లో ఉందని ప్రచారం జరుగుతోంది. మైఖెల్‌ కోర్సలేతో బ్రేకప్ అయ్యాక శ్రుతి, శాంతనుతో క్లోజ్ అయ్యిందనే టాక్ ఉంది. ముంబయిలో ఒకరి బర్త్‌డేకి మరొకరు పార్టీలు ఇవ్వడంతో ఇద్దరి మధ్య బాండింగ్‌ ఉందనే విషయం జనాలకి తెలిసిపోయింది.

శ్రుతి హాసన్ కొన్నాళ్లక్రితం ముంబయి నుంచి చెన్నై వచ్చినప్పుడు శాంతను హజారికాని కూడా తీసుకొని వచ్చింది. కమల్ హాసన్‌కి పరిచయం చేసింది. దీంతో శ్రుతి రిలేషన్‌షిప్‌కి కమల్ హాసన్‌ పర్మిషన్ ఇచ్చాడని కామెంట్స్ వినిపించాయి. ఇద్దరి లవ్‌కి కమల్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే మాటలు కూడా వచ్చాయి.

శ్రుతి హాసన్ రీసెంట్‌గా శాంతను హజారికాతో కలిసి వర్కవుట్స్‌ చేస్తోన్న వీడియో పోస్ట్ చేసింది. దీంతో శ్రుతి, శాంతను బాండింగ్‌ రోజురోజుకీ ఎక్కువవుతోందని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారేమో అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే శ్రుతీ ఈ మధ్యనే కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. 'క్రాక్, వకీల్‌సాబ్' హిట్స్‌తో మళ్లీ ట్రాక్‌ ఎక్కింది. 'సలార్‌'లో నటిస్తోంది. మరి ఈ బిజీషెడ్యూల్‌లోనే శ్రుతి పెళ్లిపీటలెక్కుతుందా అనేది చూడాలి.


మొత్తానికి శ్రుతిహాసన్ పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది తెలుస్తోంది. తమిళనాట ఆమె పెళ్లి గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఆ శుభ ఘడియ కోసం వెయిట్ చేస్తున్నారు. శ్రుతి హాసన పెళ్లి ఎక్కడ చేసుకుంటుంది.. చెన్నైలో చేసుకుంటుందా.. లేదా... ఫారిన్ కంట్రీస్ కు వెళ్లి చేసుకుంటుందా అనే విషయంపై క్లారిటీ లేదు. లొకేషన్స్ కోసం కూడా వెతుకులాట జరుగుతోందని మాట్లాడుకుంటున్నారు.



 

మరింత సమాచారం తెలుసుకోండి: