తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్ గా రాజమౌళి కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లనే చెప్పాలి.రాజమౌళి స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకునిగా తన కెరీర్ ను మొదలు పెట్టారు.  ఆ సినిమాతో తన కెరీర్ ను  మొదలు పెట్టి ఇప్పుడు తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాను చేస్తున్నారు.వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.రాజమౌళి కర్ణాటక రాష్ట్రంలోని రైచూర్ లో జన్మించారు.తన బాల్యం నుండే తనకి కథలు చదవడం అంటే బాగా ఇష్టం.అమరచిత్రకథలు అనే  పుస్తకం అంటే ఆయనకి బాగా ఇష్టమని... కాలీ సమయం దొరికితే  కథల పుస్తకాలే  చదువుతూ ఉంటారు.

అయితే రాజమౌళి మాత్రం తను చదివిన కధలను తనకి నచ్చినట్టు మార్చి  దానికి ఇంకొన్ని విషయాలను జోడించి చెప్పేవారట.ఈయన చెప్పే కథలు విని తన ఫ్రెండ్స్ బాగా విసుక్కునేవారట.రాజమౌళి తన ఇంటర్ పూర్తిచేసిన తరువాత జీవితంలో ఏం చేద్దామని అనుకుంటున్నావని కీరవాణి భార్య శ్రీవల్లి నుంచి ప్రశ్న ఎదురైంది.తన భార్య వేసిన ఒక్క ప్రశ్న ఆయన జీవితాన్నే మార్చేసింది.దీనితర్వాత ఆయన తండ్రి సహాయంతో ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర రాజమౌళి ఎడిటింగ్ అసిస్టెంట్ గా పని చేసారు.అయితే టీడీపీ పార్టీ  ప్రకటన కోసం మంచి కాన్సెప్ట్ చేసినవాళ్లకి  ఐదువేల రూపాయలు ఇవ్వడం జరిగింది.  

జక్కన్న అందరికంటే మంచి కాన్సెప్ట్ ఇచ్చి ఆ డబ్బు తనే సొంతం చేసుకున్నారు.ఆయన జీవితం లో అదే మొదటి సంపాదన.ఆ తరువాత నుండి ఆయన సంవత్సరానికి  పాతిక కాన్సెప్ట్ లు చేసి జక్కన్న మంచి పేరు తెచ్చుకున్నారు. దీనితర్వాత  శాంతినివాసం సీరియల్ తో ఆయన  దర్శకునిగా తన  కెరీర్ ను స్టార్ట్ చేశారు.అలాగే స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో సినిమా డైరెక్టర్ గా మారారు.అక్కడి నుండి వరుస విజయాలు అందుకుంటూ ముందుకు సాగాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, చరణ్ లతో 'ఆర్ ఆర్ ఆర్'అనే భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: