కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి మే నెలలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడింది.ఇక తాజాగా ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

ఇదిలా ఉంటె వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 న ఆచార్య మూవీని వాయిదా వేయడానికి గల కారణాలు ఏంటనే ప్రశ్న మెగా అభిమానులను వెంటాడుతోంది.అయితే మొదట ఈ సినిమాను డిసెంబర్ 17 న రిలీజ్ చేయాలని దర్శకుడు కొరటాల శివ భావించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ రిలీజ్ డేట్ మారడానికి పరోక్షంగా రామ్ చరణ్ కారణమని సమాచారం.రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా వచ్చే ఏడాది జనవరి 7 న విడుదల కానుండగా..మూడు వారాల గ్యాప్ లో చరణ్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కావడం మంచిది కాదని డిస్ట్రిబ్యూటర్లు భావించారు.డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ని దృష్టిలో పెట్టుకొని..

 చిరంజీవి, కొరటాల శివ ఆర్ ఆర్ ఆర్ విడుదల అయిన నాలుగు వారాల తర్వాత ఆచార్య విడుదల అయ్యేలా రిలీజ్ డేట్ ని మార్చారు.ఆర్ ఆర్ ఆర్ రిలీజైతే చరణ్ కి క్రేజ్ పెరిగి ఆచార్య సినిమాకి ప్లస్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్లు భావించారు.ఇక ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం.. అది విడుదల తర్వాత బాక్సాఫీస్ లెక్కలను మార్చడంతో పాటు ఆచార్య రిలీజ్ అయ్యే సమయానికి ఏపీ లో వంద శాతం ఆక్యుపెన్సి అమలులో వచ్చే అవకాశం ఉంది..సో మొత్తానికి ఆచార్య కొత్త రిలీజ్ డేట్ వెనక అంత పెద్ద కథ ఉందన్న మాట.మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: