ఆర్య, ఆర్య2 మరియు 100% లవ్, వంటి విభిన్న ప్రేమ కధ చిత్రాలతో టాలీవుడ్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తిపు పొందిన డైరెక్టర్ సుకుమార్. కాగా ప్రస్తుతం పుష్ప సినిమా షెడ్యూల్లో సుకుమార్ బిజీ గా వున్నాడని అందరికి తెలుసు.పుష్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించారని సమాచారం.

ఈ సంధర్భంగా సుకుమార్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారని తెలుస్తుంది. పుష్ప సినిమా విడుదలలో ఎటువంటి మార్పు ఉండబోదు అని చెప్పిన తేదీ అయిన డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకొస్తుందని ఆయన తెలియజేశారని సమాచారం.అలానే ఆర్య 3 సినిమా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తన మనసులో మాట బయట పెట్టారని తెలుస్తుంది.

సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలోని దాక్కో దాక్కో మేక వంటి మొదటి పాట ప్రేక్షకులలో మంచి గుర్తింపు పొందిందని తెలుస్తుంది.ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ పని చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. సుకుమార్ మరియు దేవిశ్రీ ప్రసాద్ కాంబో లో వచ్చిన ప్రతి సినిమా పాటలు మంచి విజయంగా నిలిచాయని సమాచారం. ఈ చిత్రంలో కూడా దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలు ఇవ్వబోతున్నట్లు వార్త వినిపిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మలయాళ స్టార్ అయిన ఫహద్ ఫజల్ మరియు సునీల్, వెన్నెల కిషోర్ అలాగే అనసూయ తదితర నటులు నటిస్తున్నారని అందరికి తెలుసు.

అయితే ఇప్పుడు అల్లు అర్జున్ సుకుమార్ ఇద్దరు కలయికతో వచ్చిన ఆర్య మరియు ఆర్య 2 తెరకెక్కిన విషయం అందరికి తెలుసు. అందులో ఆర్య సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిందని కూడా అందరికి తెలుసు. కానీ ఆ తరువాత వచ్చిన ఆర్య సినిమా సీక్వల్ ఆర్య 2 అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి. మరి ఆర్య 2 ఫలితం చూసి కూడా ఆర్య 3 తెరకెక్కించబోతున్నారంటే సాహసమనే చెప్పాలి. మరి ఆర్య సినిమా సిరీస్ ని కొనసాగించాలి అనే ఆలోచనలో ఉన్నట్లు సుకుమార్ తెలిపినట్లు సమాచారం.ఈ మేరకు త్వరలోనే ఆర్య 3 ని చేయనున్నారని అలాగే ఇందు కోసం సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారని తెలుస్తుంది. ఆ ఆలోచన పుష్ప సెట్స్ లోనే వచ్చిందని సుకుమార్ అభిమానులకు వివరించారని సమాచారం. ఈ చిత్రంలో నటీనటుల గురించి ప్రస్తుతానికి ఇంకా ఏం అనుకోలేదని అన్నారని తెలుస్తుంది. మరి ఈ సినిమాలో గీత ఎవరో అలాగే అజయ్ ఎవరో చూడాలి తెలియాలంటే కొద్దీ నెలలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: