అందాల హీరోయిన్ ముద్దుగుమ్మ శ్రియ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో జతకట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక హీరోయిన్ వివాహం తర్వాత సినిమాలకి దూరంగా ఉంది. దాదాపుగా 20 ఏళ్ల కు పైగా టాలీవుడ్ లో తన అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక రాజమౌళి తెరకెక్కిస్తున్న..RRR మూవీ లో ఒక ప్రధాన పాత్రలో నటిస్తోంది.

ఇక అసలు విషయానికి వస్తే 2018లో రష్యన్ క్రీడాకారుడు ఆండ్రీ కోషివ్ ను వివాహం చేసుకుంది శ్రియ. ఇక వివాహం తర్వాత వీరిద్దరు చేస్తున్నటువంటి రచ్చ ఎంత వైరల్గా మారాయో మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడూ ఏదో ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు ఈ జంట. ఇక గత సంవత్సరం వీరిద్దరు కలిసి బోర్సిలోనాకు వెళ్లగా అక్కడ కరోనా ఎక్కువగా ఉండటం చేత..లాక్ డౌన్ పడడంతో వీరిద్దరు అక్కడే ఉండిపోయారు.


ఇక అదే సమయంలో శ్రియ ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు. సమాచారం. ఇక వీరిద్దరూ ఒక ఏడాది వరకు శ్రియ గర్భవతి అనే విషయాన్ని బయట పెట్టు కపోవడం గమనార్హం. తాజాగా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వీరిద్దరికీ ఒక అమ్మాయి జన్మించిందని తెలియజేస్తోంది శ్రియ. ఇక గత సంవత్సరంలో ప్రపంచం మొత్తం తలకిందులు అయిపోయింది.ఒక సంవత్సరం పాటు అందరు క్వారంటైన్ లో ఉండి పోయారు.కరొనా కారణంగా ఎంతోమంది గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు.


కానీ హీరోయిన్ శ్రియ జీవితంలో మాత్రం ఒక అద్భుతం జరిగిందని చెప్పుకొస్తోంది. తన చిన్నారి పాప రాకతో  మా ఇద్దరి ప్రపంచమే మారిపోయింది అని చెప్పుకొచ్చింది. ఏంజెల్ లాంటి ఈ చిన్నారి పుట్టడం చేత ఎంతో సంతోషంగా జీవితాన్ని గడిపాము. ఈ చిన్నారిని మాకు దేవుడు ప్రసాదించినందుకు ఎంతో రుణపడి ఉంటాను అన్నట్లుగా తెలియజేస్తోంది హీరోయిన్ శ్రియ. ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్లు మొదట షాక్ తిన్న. ఆ తర్వాత ఈమె కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: