రజనీకాంత్ ను సూపర్ స్టార్ చేసిన సినిమా భాష.  ఆ సినిమాలో కథ డైరెక్షన్ సంగీతం నటీనటుల నటన అలాగే నేపథ్య సంగీతం వంటివే కాకుండా ఇంకొక అంశం కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది.  అందుకే అంత పెద్ద హిట్ అయ్యింది. నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే అని చెప్పే డైలాగ్ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం అని ఎవరిని అడిగినా చెబుతారు. 1995వ సంవత్సరంలో తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కాగా రజినీకాంత్ డైలాగ్స్ కోసమే ఈ సినిమాకు ప్రేక్షకులు తరలి వెళ్లారు.

ఒక ఆటో డ్రైవర్ ఈ విధంగా అండర్ వరల్డ్ డాన్ అయ్యాడు. మళ్లీ సాధారణ జీవితాన్ని ఎందుకు గడుపుతున్నాడు అనేదే ఈ సినిమా కథ. మాణిక్యం మాణిక్ భాష గా ఏవిధంగా మారాడు అనేదే ఈ సినిమాలోని అసలు విషయం. రఘువరన్ తన విలనిజాన్ని మరొకసారి ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు రుచి చూపించగా తన అందాలతో అందరినీ ఆకట్టుకుంది నగ్మా. ఈ సినిమా సూపర్ హిట్ కావడానికి ముఖ్య కారణం అయ్యింది. ఈ సినిమాలో చాలా డైలాగులు కేవలం సినిమా కోసమే తయారు అయ్యాయి అని చెప్పవచ్చు.

కథ లేనప్పుడు కొంతమంది దర్శకులు డైలాగులతో సూపర్ హిట్ చేస్తారు కానీ ఈ సినిమా కథ లోని డైలాగులు ప్రతి ఒక్కరిని ఎంతగానో రంజింప చేసింది. ఏదేమైనా డైలాగ్స్ తో కూడా సినిమా సూపర్ హిట్ చేయవచ్చు అని రజినీకాంత్ భాషా సినిమా తో చాటి చెప్పాడు. అలాగే ఇలాంటి కథను తర్వాత చాలా మంది చేయగా అవి ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు.  దానికి కారణం భాషా సినిమా లో ఉన్నటువంటి డైలాగ్స్ ఆ సినిమాలో లేకపోవడమే.  ఎంత ఎలివేషన్ ఇచ్చినా కూడా రజినీకాంత్ స్టైల్ లో డైలాగ్ చెప్పకపోతే ఈ ఇతివృత్తం ఉన్న సినిమాలు పెద్దగా ఆడవు. ఆ విధంగా భాష చిత్రం దేశంలోనే సంచలనం రేకెత్తించిన సినిమా అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: