మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు. ఆయన నటనకు డాన్స్ కు మేనరిజం కు అలాగే స్టైల్ కి కూడా ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు కానీ ఆయన చెప్పే డైలాగ్ లకు కూడా అభిమానులు ఉంటారా అంటే ఉంటారు అని తప్పకుండా చెప్పవచ్చు. డైలాగ్ డెలివరీలో తనకే సొంతమైన శైలితో డైలాగులు చెబుతూ ఇప్పటివరకు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. ఇక ఆయన కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ఇంద్ర.

ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ప్రతి ఒక్క డైలాగ్ కి సినిమా హాల్లో క్లాప్స్ కొట్టారు. బి.గోపాల్ దర్శకత్వంలో 2002వ సంవత్సరంలో ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.  అనుకున్న విధంగానే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించే సినిమాలలో క్లాసిక్ హిట్ చిత్రంగా నిలిచిపోయింది అని చెప్పవచ్చు.  ఈ సినిమాలోని డైలాగులు విపరీతమైన ప్రేక్షకాదరణ పొందాయి.  

ముఖ్యంగా వీర శంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యింది.  ఇంకా సింహాసనంపై కూర్చునే హక్కు అక్కడ ఆ ఇంద్రుడిని ఇక్కడ ఈ ఇంద్రసేనారెడ్డి అని చెప్పే డైలాగ్ మరింత ప్రేక్షకాదరణ పొందింది. ఇంకా కాశీ కి వెళ్ళాడు కాషాయం వాడయ్యాడు అనుకున్నారా వారణాసి వెళ్ళాడు వరస మార్చుకున్నాడు అనుకున్నారా.. అదే రక్తం.. అదే పౌరుషం.. అని చిరంజీవి డైలాగ్ చెబుతుంటే ప్రేక్షకులు ఏ విధంగా ఎంజాయ్ చేశారో అప్పట్లో ఈ సినిమా థియేటర్లో చూసిన ప్రతి వారికి తెలుసు. ఇక శౌక తాలి ఖాన్ అంటూ ఆయన చెప్పిన మరో డైలాగ్ కూడా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు.  మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు సూపర్ హిట్ కాగా ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కి నంది అవార్డు కూడా లభించడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: