మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా 107 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిన విదితమే. ఆయన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రధానంగా మంచు విష్ణు గెలుపుకు కారణమయ్యాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సైతం మంచు విష్ణుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక దాదాపు రెండు దశాబ్దాల నుంచి విష్ణు నటుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

విష్ణు నటించిన సినిమాలలో హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న విష్ణు త్వరలో ఢీ అండ్ ఢీ షూటింగ్ కి హాజరుకానున్నారు. అంతేకాదు.. పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించిన విష్ణు నిర్మాతగా కూడా విజయాన్ని అందుకున్నారు. ఇక మరోవైపు విష్ణు వ్యాపారవేత్తగా కూడా రాణిస్తుండటం గమనార్హం అనే చెప్పాలి. అయితే మంచు విష్ణు భార్య పేరు విరనికా రెడ్డి అనే సంగతి అందరికి తెలిసిన విషయమే. ఇక విరనికా రెడ్డి సీఎం జగన్ కు వరుసకు చెల్లి అవుతుంది.

విరనికా రెడ్డి వ్యక్తి గత విషయంలోకి వెళ్తే.. అమెరికాలోనే పుట్టి పెరిగిన ఆమె తర్వాత కాలంలో ఇండియాకు తిరిగి వచ్చారు. ఇక మంచు విష్ణు, విరనికా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. కాగా.. విరనికా కుటుంబానికి ఆఫ్రికాలో చాలా వ్యాపారాలు ఉన్నట్లు సమాచారం. ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే.

అయితే సోషల్ మీడియాలో విష్ణు యాక్టివ్ గా ఉంటూ వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటాడు. కానీ విరనికా మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండదు. ఇక కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే విరనికా భర్త చాటు భార్యగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. అయితే బాల్యంలో విరనికా రెడ్డి డాక్టర్ కావాలని అనుకున్నారంట.

మరింత సమాచారం తెలుసుకోండి: