ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం సినిమా ఇండస్ట్రీలోకి కమెడియన్ గా వచ్చి రాణించాలనుకునే ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది అనే చెప్పాలి. ప్రస్తుతం జబర్దస్త్ లో రాణిస్తున్నవారు అటు చాలా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. జబర్దస్త్ ద్వారా తమ ప్రతిభను చాటి ఎన్నో మన్ననలు కూడా పొందుతున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా బాగా క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్ లలో గెటప్ శీను కూడా ఒకరు.   జబర్దస్త్ లో ఎన్నో గెటప్పులు వేసి శీను కాస్త గెటప్ శ్రీను గా మారిపోయాడు.  అయితే ఎలాంటి గెటప్ వేసిన కూడా ఆ పాత్రకు జీవం పోస్తూ ఉంటాడు గెటప్ శీను. గెటప్ శీను తప్ప ఇంకెవరూ ఆ పాత్ర చేయలేరేమో అన్నట్లుగా తన నటనతో ప్రభావితం చేస్తూ ఉంటాడు.



 అయితే గెటప్ శ్రీను ఇప్పటివరకు ఎన్ని గెటప్లు వేసినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కైకల సత్యనారాయణ గెటప్ మాత్రం ప్రేక్షకులకు ఎప్పుడు ఫేవరేట్ గా ఉంటుంది.  అచ్చు గుద్దినట్లు గా కైకల సత్యనారాయణ ను ఇమిటేషన్ చేసే గెటప్ శ్రీను ఆయన గెటప్ లో కూడా ఎంతో అద్భుతంగా నటిస్తూ ఉంటారు.  ఇప్పటివరకు పలు కార్యక్రమాల్లో ఇలా కైకాల సత్యనారాయణ పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు గెటప్ శీను.  ఇక ఇటీవల మరోసారి కైకాల సత్యనారాయణ నటించిన యముడు పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.



 అప్పట్లో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన యమలీల సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది. అయితే ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవలే ఈ టీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో యమలీల అనే కొత్త ఈవెంట్ చేశారు.  ఇక ఈ కార్యక్రమానికి యమలీల సినిమా హీరో అలీ హీరోయిన్ ఇంద్రజ దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి వచ్చారు.ఈ క్రమంలోనే  కైకాల సత్యనారాయణ పాత్రలో యముడి గెటప్ లో కనిపిస్తాడు గెటప్ శీను  వాయిస్ మాత్రమే కాదు హావభావాలను కూడా అచ్చు గుద్దినట్లు గా చేస్తాడు  గెటప్ శీను నటన చూసి దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఫిదా అవుతాడు. ఈ సమయంలో కైకల సత్యనారాయణ ఉంటే నిన్ను చూసి మురిసిపోయేవారు అంటూ కామెంట్ కూడా చేస్తాడు ఎస్.వి.కృష్ణారెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: