మూవీ ఆర్టిస్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపొందిన సంగతి తెలిసిందే. తన ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ ప్యానెల్ పై భారీ మెజారిటీతో గెలిచి.. మా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నాడు మంచు విష్ణు. అయితే ఎన్నికల్లో విష్ణు ఎలా గెలిచాడు అంటే.. చాలా రకాల సమాధానాలే వినిపిస్తున్నాయి.అందులో ఓటర్ల మొబిలైజేషన్‌ కూడా ఒకటని చెప్పొచ్చు.'మా' లో సభ్యత్వం ఉండి.. దూర ప్రాంతాల్లో ఉన్నవారి విషయంలో మోహన్ బాబు, మంచు విష్ణు చాలానే ప్లాన్స్ వేశారు.ఎన్నికల రోజు వారిని హైదరాబాద్ రప్పించి మరీ.. ఓటు వినియోగించుకునేలా చూసుకున్నారు.అయితే దీని కోసం ఖర్చు కూడా గట్టిగానే అయ్యిందని అంటున్నారు.

నిజం చెప్పాలంటే సాధారణ ఎన్నికలను తలపించేలా మా ఎన్నికలు జరిగాయి. సాధారణ ఎన్నికల్లో అయితే.. ఎక్కడో ఉద్యోగం కోసం దూరంగా ఉన్న వారికి టికెట్లు తీసి ఇచ్చి మరి ఓటింగ్ రమ్మని అంటుంటారు.అయితే ఇప్పుడు విష్ణు కూడా అదే పని చేసాడట. అంతేకాదు ఈ విషయంలో ప్రకాష్ రాజ్ ఓడిపోయారని అంటున్నారు కూడా.బయట రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కి వచ్చి ఓటు వేసిన వారికి విమాన టికెట్లని, హోటళ్లని.. ఇలా సుమారు 20 లక్షల వరకు ఖర్చు పెట్టారని టాక్ వినిపిస్తోంది.ఇదే కాకుండా రెండు ప్యానెల్స్ కి సంబంధించి లంచ్ మీటింగ్లు, డిన్నర్ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది.సుమారు ఏడు సార్లు ఈ మీటింగ్లు జరిగినట్లు తెలుస్తోంది.

ఒక్కో మీటింగ్ కి 6 నుండి 8 లక్షల వరకు ఖర్చు అయి ఉంటుంది.ఆ లెక్కన చూసుకుంటే సుమారు 60 లక్షలు వేసుకుంటే..ఇక మిగిలిన ఖర్చులు, వాహనాలు ఇలా అన్నీ కలిపి మరో 20 లక్షలు వరకు అయ్యుంటాయని అంటున్నారు.దీంతో మొత్తం ఈ ఎన్నికల కోసం సుమారు కోటి రూపాయల వరకు ఖర్చు చేసారని టాక్.అయితే ఈ ఎన్నికలకు అంత ఖర్చు అవసరమా అని కొందరు అంటుంటే.. ఇది వాళ్ళ పప్రెస్టీజ్ ఇష్యు అని ఇంకొందరు అంటున్నారు.అయితే తన కొడుకును ఎలాగైనా గెలిపించాలని మోహన్ బాబు ముందుండి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారట.అయితే ఈ విషయంలో మాత్రం ప్రకాష్ రాజ్ వెనక పడ్డాడని.. తనకు తక్కువ ఓట్లు పోల్ అవ్వడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని అంటున్నారు ఇండ్రస్టీ ప్రముఖులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: