ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత హోరా హోరీగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా మంది సెలబ్రిటీలు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఇక ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలుచిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలు తెచ్చిన సంక్షోభం ఇప్పుడు కొత్త కోణం తీసుకుంది.ఇప్పటికే మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ తరపున గెలిచిన అందరూ రాజీనామాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.'మా ఎన్నుకల్లో చాలా రౌడీయిజం చేశారు.నరేష్ ప్రవర్తన సరిగ్గా లేదు.సగం సగం కార్యవర్గం వల్ల ఏమీ ఉపయోగం లేదు.

మా సంక్షేమం కోసం ఎంతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం.మంచు విష్ణు ఎన్నో హామీలు ఇచ్చారు.మా సంక్షేమం విషయంలో మంచు విష్ణు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.అందుకోసమే ఒక డీసెంట్ డెసిషన్ తీసుకున్నాం.మీకు అడ్డురాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం' అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు.ఎన్నికల్లో మొదటి రోజు గెలిచిన వారు రెండో రోజు ఓడిపోయారు అసలు ఏమిటి ఇదంతా? అని ఆయన ప్రశ్నించారు.ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని,పోస్టల్ బ్యాలెట్ లో అన్యాయం జరిగిందని  వారు ఆవేదన వ్యక్తం చేశారు."ఎన్నికలు అయిన వెంటనే నేను ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను.

అయితే మంచు విష్ణు ఆ రాజీనామా ఆమోదించలేదు.నేను అసోసియేషన్ లో తిరిగి ఉండాలని అన్నారు'.'నేను కచ్చితంగా నా రాజీనామా నేను వెనక్కి తీసుకుంటాను.కానీ నాది ఒక కండీషన్.అది ఏమిటీ అంటే..నాన్ లోకల్ అనే పదాన్ని వెనక్కి తీసుకోవాలి.ఎన్నికల్లో ఓటు వేయడానికో..మరో విధంగా చేయడానికో నేను 'మా' లో కొనసాగలేను.మా లో మార్పు తీసుకొస్తే నాకుఇందులో కొనసాగడానికి సిద్ధంగా ఉన్నాను'అంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.అయితే ప్రకాష్ రాజ్ కండీషన్ కి మంచు విష్ణు ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.మరి ప్రకాష్ రాజ్ విషయంలో మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: