తాజాగా జరిగిన మా ఎన్నికల్లో యువ హీరో తనీష్ తాను ఏ ఒక్కరోజూ మీడియా మందుకు రాలేదు అని అన్నారు. అయితే ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లోని 11 మంది సభ్యులు మంగళవారం రాజీనామా చేయడం జరిగింది.దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్ లో తనీష్ మాట్లాడారు.ఒకరితోటి నేను ఎప్పుడు మాటలు పడను...ఒకరి గురించి ఎప్పుద్ తప్పుగా మాట్లాడను..వీటికి నేను ఎప్పుడూ దూరంగా ఉంటాను అని చెప్పుకొచ్చారు.ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసిన ప్రతిఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.అలాంటి వారందరు రాజీనామా చేసినందుకు తనను క్షమించాలని  చెప్పాడు తనీష్.అయితే తనీష్ చాలా మందికి కాల్ చేసి తన ప్యానెల్ ఎజెండా  గురించి చెప్పారు...

అప్పుడు వాళ్ళందరూ నువ్వు  మాలో వుంటే మంచిదని  సూచించారు.కాగా నరేష్ చాలా ఇంటర్వ్యూలలో కొందరు తమను పనిచేయనివ్వలేదని చెప్పుకొచ్చారు.అయితే వీరు కేవలం  ఈసీ మెంబర్స్ మాత్రమేనని తనీశ్ చెప్పారు.ఇలాంటి సమస్య మళ్ళీ ఎప్పుడూ రాకూడదని ఆయన ఆకాంక్షించారు.ఇదే కాకుండా ప్రకాశ్ రాజ్  సిద్ధాంతాలు,భావాజాలం ఆయనకు  ఎంతగానో నచ్చి  ఆయన ఈ ప్యానెల్ వైపు వచ్చానన్నారు. మోహన్ బాబు ఇంకా తన కుటుంబం అంటే తనకి చాలా ఇష్టమని కూడా చెప్పాడు.చాలా సార్లు మోహన్ బాబు తనని తిట్టారని... ఈ విషయం తెలుసుకున్న బెనర్జీ తనని రక్షించడానికి మోహన్ బాబుకి అడ్డు వెళ్లారని చెప్పుకొచ్చాడు.

అడ్డువచిన్న  బెనర్జీ ని కూడా మోహన్ బాబు తిట్టారని చెప్పుకొచ్చాడు.మోహన్ బాబు తో బెనర్జీ మాటలు పడడానికి కారణం నేనేనని అందుకు నన్ను క్షమించాలని అన్నాడు.దీనితో తను బాగాఎమోషనల్ అయ్యానని..అప్పుడు విష్ణు, మనోజ్‌లు వచ్చి తనను ఓదార్చారని చెప్పాడు.తన చిన్నతనం నుండి వారి ఇంట్లోనే పెరిగానని..ఇలా మాట్లాడడంతో తను  చాలా బాధ పడ్డాడని చెప్పాడు.ఈసీ మీటింగ్స్ జరిగినప్పుడు వెళ్లాల్సి వస్తుందని ఆ సమయం లో ఏదన్నా జరిగితే ఎలా అని ఉద్వేగానికి గురయ్యారు. ఆఖరిగా తన రాజీనామా వల్ల ఎవరన్నా  బాధపడితే తనని  క్షమించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: