'మా' ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ బలయ్యాడు. ఇది బయటకు వినిపిస్తున్న మాట.పోటా పోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో తమ ఫ్యామిలీలోని వ్యక్తుల చేతే ఓట్లు వేయించలేక పోయింది మెగా కుటుంబం.మరో వైపు మంచు విష్ణు ఎక్కడో ఢిల్లీ లో ఉన్న జయప్రద దగ్గర నుంచీ జెనీలియా వరకు అందర్నీ తీసుకొచ్చాడు.ఈ విషయం పక్కన పెడితే మా ఎన్నికల వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారి కొందరి మనసులను గాయపరిచింది.సహజంగా కళాకారులకు ఇగో అనేది ఎక్కువ ఉంటుంది.కానీ ఆ ఇగోని రెట్టింపు చేసి వారిని బాగా బాధ పెట్టేలా జరిగాయి మా ఎన్నికలు.

కానీ ఎన్నికల తర్వాత మంచు విష్ణు కి సవాళ్లు ప్రతి సవాళ్లు ఎక్కువవుతున్నాయి.ఒక విధంగా చెప్పాలంటే అసలు ఈ మా ఎన్నికల్లో గొడవలకు తెర లేపింది నాగబాబునే.ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసుకున్నా కూడా వారి వారి పరిధి దాటి ప్రవర్తించలేదు.కానీ నాగబాబు ఎంట్రీతో ఒక్కసారిగా అంతా మారిపోయింది.నాగబాబుని చూసి చివరిలో ప్రకాష్ రాజ్ రెచ్చిపోయాడు.ప్రచారాల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.దాంతో ఎన్నికల్లో రెండు వైపులా హడావిడి అనేది పెరిగింది.ఇక మా సిట్టింగ్ అధ్యక్షుడు నరేష్ ప్రత్యర్ధులని విమర్శిస్తూ మొత్తానికి మా ఎన్నికల భాగవతంలో తనది కృష్ణుడి పాత్ర అని చెప్పుకున్నాడు.

ఇక ఈ ఎన్నికల విజయం మంచు విష్ణు కి దక్కింది.అయితే ఆ విజయానికి కారణమైన నరేష్ పై ఇప్పుడు మంచు విష్ణు యాక్షన్ తీసుకోవాలని తాజాగా శివాజీ రాజా డిమాండ్ చేస్తున్నారు.నరేష్ మా ఎన్నికల్లో కొన్ని తప్పులు చేసాడని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కొంతమందైతే ఆరోపణలు కూడా చేస్తున్నారు.ఈ నేపథ్యంలో విష్ణు ఎలాంటి యాక్షన్ తీసుకోనున్నాడు?తనను గెలిపించిన నరేష్ పై విష్ణు అసలు యాక్షన్ తీసుకుంటాడా?అసలు నరేష్ కి వ్యతిరేకంగా విష్ణు నిర్ణయాలు తీసుకోగలడా అనే రకరకాల ప్రశ్నలు మా నుండి తలెత్తుతున్నాయి. మరి ఈ ప్రశ్నలన్నింటికీ విష్ణు సమాధానం ఇస్తాడేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: