దర్శకధీరుడు కె.రాఘవేంద్రరావు ఎంతోమంది హీరోలని లాంచ్‌ చేశాడు. మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ కిడ్స్‌ని వెండితెరకి పరిచయం చేశారు. కమర్షియల్ సినిమాలకు కొత్త రంగులద్దిన ఈ దర్శకుడు యాక్టర్‌గానూ మారారు.'పెళ్లి సందఢి' సినిమాలో కీ-రోల్ ప్లే చేస్తున్నారు దర్శకేంద్రుడు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ కుమారుడు రోషన్‌ హీరోగా లాంచ్ అవుతున్నాడు.

యూత్‌ఫుల్‌ స్టోరీస్‌తో సూపర్‌ రెస్పాన్స్‌ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. 'పెళ్లిచూపులు' సినిమాతో నేషనల్‌ అవార్డ్‌ కూడా అందుకున్న ఈ దర్శకుడిలో రైటర్‌తో పాటు, యాక్టర్‌ కూడా ఉన్నాడు. అందుకే విశ్వక్‌ సేన్, విజయ్‌ దేవరకొండ ఇద్దరూ భాస్కర్‌ని కెమెరా ముందుకు తీసుకొచ్చారు. 'ఫలక్‌నుమా దాస్'లో సపోర్టింగ్ రోల్ చేసిన, తరుణ్ భాస్కర్, 'మీకు మాత్రమే చెప్తా' సినిమాలో లీడ్‌ రోల్ ప్లే చేశాడు.

తరుణ్ భాస్కర్‌ యాక్టింగ్ పాటు పాటలు కూడా ప్రయత్నం చేశాడు. వెబ్ ఫిల్మ్ 'సినిమా బండి'లో సినిమా తీసినం అనే పాట పాడాడు తరుణ్. అలాగే ఒక టాక్‌ షోకి హోస్టింగ్ కూడా చేశాడు. ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామాస్‌తో సూపర్ హిట్స్ కొట్టిన దర్శకుడు శివ నిర్వాణ. యూత్, ఫ్యామిలీ ఇద్దరికీ కనెక్ట్‌ అయ్యే కథలు తీస్తోన్న ఈ దర్శకుడు రీసెంట్‌గా లిరిక్ రైటర్ కమ్ సింగర్‌గా మరో కోణం చూపించాడు. నానితో తీసిన 'టక్ జగదీష్' సినిమాలో టక్ సాంగ్ రాసి, పాడాడు శివ నిర్వాణ.

'మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా' సినిమాలతో మంచి హిట్స్ కొట్టాడు వివేక్ ఆత్రేయ. ప్రస్తుతం నానితో 'అంటే సుందరానికి' అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ డైరెక్టర్ ఫిల్మ్ మేకింగ్‌తో పాటు, పాటలు కూడా రాస్తున్నాడు. ఇప్పటికే మెంటల్ మదిలో 'గుమ్మడికాయ హల్వా, ఊహలే' పాటలతో పాటు ఈ నగరానికి ఏమైంది సినిమాలో 'మారే కలలే.., వీడిపోనిది ఒకటేలే' అనే పాటలు రాశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: