పూజా హెగ్డే తన గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్ తో చిత్ర పరిశ్రమలో సునామీ సృష్టిస్తోంది. అందాల పోటీ విజేత నుండి అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారింది. యంగ్ హీరోలతో పాటు పాన్ ఇండియా స్టార్స్ తోనూ రొమాన్స్ చేసే అవకాశాన్ని కొట్టేసింది. హేగ్డే 2016 లో 'మొహెంజో దారో' చిత్రంతో హృతిక్ రోషన్‌తో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. అందం, అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. నటికి 30 సంవత్సరాలు నిండిన పూజా హెగ్డే గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలను మేము మీకు చెప్తాము.

1. ఆమె శ్రీమతి మిథిబాయ్ మోతిరామ్ కుండ్నాని కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో చదువుకుంది. దీనిని మహారాష్ట్రలోని ముంబైలో MMK కాలేజ్ అని కూడా అంటారు.

2. ఆమె ముంబైలో పెరిగినందున మరాఠీలో మంచి ప్రావీణ్యం ఉంది. కన్నడ ఆమె మాతృభాష కావడంతో అందులో కూడా పూజా నిష్ణాతురాలు. పూజకు హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తెలుగు, కన్నడ 5 భాషలు తెలుసు.

3. ఈ నటి గతంలో మిస్ యూనివర్స్ ఇండియా 2010 రన్నరప్‌గా నిలిచింది. అందమైన పూజా హెగ్డే 2010 లో మిస్ యూనివర్స్ అందాల పోటీలో పాల్గొంది. దురదృష్టవశాత్తు, ఆమె పోటీలో గెలవలేదు కానీ ఆమె సెకండ్ రన్నరప్. 2010 లో మిస్ ఇండియా సౌత్ గ్లామరస్ హెయిర్‌గా ఆమె కిరీటం దక్కించుకుంది.

4. 'మొహంజొదారో'లో పని చేస్తున్న సమయంలో పూజా మణిరత్నం తమిళ సినిమాను తిరస్కరించాల్సి వచ్చింది.

5 అదే సమయంలో ఆమె హృతిక్ రోషన్ తో రిలేషన్ లో ఉందంటూ పుకార్లు వచ్చాయి. కానీ ఆమె హృతిక్ రోషన్‌తో లింకు అప్ పుకార్లను ఖండించింది.

6. పూజకు ఎప్పుడూ డ్యాన్స్‌పై ఆసక్తి ఉండేది. ఆమె బాల్యంలోనే తన నృత్య తరగతులను ప్రారంభించింది. ఆమె ఒక భరతనాట్య నర్తకి. కళాశాల రోజుల్లో ఆమె వివిధ ఫెస్ట్‌లు, నృత్యాలలో పాల్గొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: