నయనతార పర్సనల్ లైఫ్ కోసం సినిమాలని కూడా త్యాగం చేసేందుకు సిద్ధమైంది. ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నప్పుడు సినిమాలు మానేస్తానని స్టేట్ మెంట్స్ కూడా ఇచ్చింది. ప్రభుదేవాతో పెళ్లి కన్ఫర్మ్ కాగానే, సినిమాలకి గుడ్‌ బై అని ఎమోషనల్ అయింది. 'శ్రీరామరాజ్యం' సెట్స్‌లో సెండాఫ్ కూడా ఇచ్చారు. అయితే ఈ రిలేషన్ పెళ్లిపీటలెక్కుండానే విడిపోయింది. యనతార ఫస్ట్ ఇన్నింగ్స్‌లో స్టార్ హీరోలతో సినిమాలు చేసింది గానీ, వాళ్లతో సమానమైన ఇమేజ్ తెచ్చుకోలేదు. అయితే ప్రభుదేవాతో విడిపోయాక స్ట్రాంగ్‌ రోల్స్‌ ప్లే చేసింది. 'రాజారాణి, నానుమ్ రౌడీధాన్, అరమ్' లాంటి సినిమాలతో లేడీ సూపర్‌స్టార్ అనిపించుకుంది. రీసెంట్‌గానే విఘ్నేష్‌ శివన్‌తో నయన్‌కి ఎంగేజ్‌మెంట్‌ కూడా అయింది.

త్రిష ఆరేళ్ల క్రితమే శ్రీమతి త్రిష మనియన్‌గా మారిపోయేది. బిజినెస్‌మెన్‌ కమ్ ప్రొడ్యూసర్ వరుణ్‌ మనియన్‌తో 2015లో త్రిషకి ఎంగేజ్‌మెంట్ అయ్యింది. అయితే పెళ్లి డేట్ ఫిక్స్ అవుతోన్న సమయంలో ఇద్దరూ విడిపోయారు. ఇక ఈ బ్రేకప్ తర్వాత త్రిష మళ్లీ సినిమాలతో బిజీ అయ్యింది. 'పొన్నియన్ సెల్వన్' లాంటి భారీ సినిమాలు చేస్తోంది. రష్మిక మందన్న కన్నడలో 'కిరిక్ పార్టీ'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిందో లేదో, ఈ సినిమా విడుదల కాగానే.. ఎంగేజ్‌మెంట్ చేసింది. 'కిరాక్ పార్టీ' స్టార్ రక్షిత్ శెట్టికి రింగ్‌ తొడిగేసింది. అయితే రష్మిక టాలీవుడ్‌కి వచ్చాక ఆ ఎంగేజ్‌మెంట్ బ్రేక్ అయింది.   అయితే తెలుగులో వరుస అవకాశాలు అందుకుని ఇక్కడ టాప్ హీరోయిన్ అయింది. అలాగే హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఒక సినిమా, అమితాబ్ బచ్చన్‌తో ఒక సినిమా చేస్తోంది రష్మిక.

మెహరీన్‌కి హర్యానా పొలిటికల్ లీడర్ భవ్య భిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్ అయ్యాక సినిమాలకి దూరమైనట్టే కనిపించింది. ఆ సమయంలో సినిమాలకు కూడా పెద్దగా సైన్ చేయలేదు. అయితే ఈ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యాక మెహరీన్ వరుస సినిమాలకి సైన్ చేస్తోంది. 'ఎఫ్-3'తో పాటు మారుతి దర్శకత్వంలో 'మంచి రోజులు వచ్చాయి' అనే సినిమా చేస్తోంది. శ్రుతీ హాసన్‌ మైఖెల్‌ కోర్సలేని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు సినిమాలకి దూరమైంది. అయితే సడన్‌గా శ్రుతీని వదిలిపెట్టి మైఖెల్‌ ఇంగ్లాండ్‌కి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొత్త ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసింది శ్రుతీ హాసన్. వెయిట్‌ తగ్గించుకుని కొత్త మేకోవర్‌తో 'క్రాక్, వకీల్‌సాబ్‌' సినిమాలు చేసింది. ఇప్పుడు ప్రభాస్‌తో కలిసి 'సలార్‌'లోనూ స్టెప్పులేస్తోంది శ్రుతి.






మరింత సమాచారం తెలుసుకోండి: